
Index Funds: కరోనా తర్వాత దేశంలో చాలా మంది ప్రజలకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువగా మెుగ్గుచూపటం స్టార్ట్ చేశారు. పైగా సామాన్యుల మధ్యతరగతి చిన్న పొదుపుదారులకు సైతం అందుబాటులో మ్యూచువల్ ఫండ్ సిప్ తీసుకురావటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో అనేక అసెట్ మెనేజ్మెంట్ కంపెనీలు కొత్త ఫండ్స్ కూడా లాంచ్ చేయటం పెంచాయి.
సహజంగా పెట్టుబడిదారులు చాలా మంది ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారని మనందరికీ తెలిసిందే. దశాబ్ధాల కాలం నుంచి ఇదొక మంచి పెట్టుబడి మార్గంగా చాలా మంది పరిగణించటంతో ఇండెక్స్ ఫండ్స్ కి ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది. వీటిలో తక్కువ రిస్క్ కలిగి ఉండటంతో పాటు ఎక్కువ డైవర్సిఫై కావటం వల్ల మార్కెట్ ఒడిదొడుకుల వల్ల కలిగే ప్రభావం తక్కువగా ఉంటుంది. పైగా ఈ ఫండ్స్ నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్ల నిర్వహణలో ఉండటం కారణంగా పెట్టుబడిదారులకు ఆందోళన చాలా తక్కువగా ఉంటుంది.
ఇవి బెంచ్ మార్క్ సూచీలను ట్రాక్ చేస్తున్నందున ఫండ్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇన్వెస్టర్లు కేవలం చేయవలసిందల్లా సరైన ఫండ్ ఎంచుకోవటమే.
* ముందుగా పెట్టుబడిదారులు తమ రిస్క్ రిటర్న్ అవసరాలకు అనుగుణంగా ఉన్న ఫండ్ ఎంపిక చేసుకోవటం ఉత్తమం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ప్రధానంగా అధిక ఓలటాలిటీ రిస్క్ కలిగి ఉంటాయి. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్ మెరుగైన రిస్క్, రివార్డ్ రేషియోను కలిగి ఉంటాయి. దీనిని పరిశీలించటానికి ఫండ్ ట్రాక్ రికార్డ్ గమనించటం ముఖ్యం.
* ఇన్వెస్టర్లు తక్కువ ట్రాకింగ్ తేడాలు కలిగిన అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉండే ఫండ్స్ ఎంచుకోవటం ఉత్తమం. ఇవి ట్రేడింగ్ ఖర్చులను తగ్గించి మెరుగైన రాబడులను అందించటంలో దోహదపడతాయి.
* ఏదైనా ఫండ్ ఎంపిక చేసుకోవటానికి ముందు ఇన్వెస్టర్లు దాని స్టెబిలిటీ, పాపులారిటీని కూడా పరిగణలోకి తీసుకోవటం ఉత్తమం. దీనికోసం పెట్టుబడిదారులు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉన్న స్కీమ్స్ పెట్టుబడి కోసం ఎంపిక చేసుకోవటం ఉత్తమం.