ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!

ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!

ఇతరులతో జీవితాన్ని పంచుకుంటేనే.. మన జీవితం పరిపూర్ణమవుతుందా? క్రియేటర్ జీవితాన్ని ఇంత అందంగా సృష్టిస్తే.. మనమెందుకు గొడవలతో చిందరవందర చేసుకుంటున్నాం... ప్రేమతో ..మోసం చేసి వెళ్లిన వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలి? ఇలాంటి సందేహాల గురించి సద్గురు చెప్పే మాటలివి. 

మోసం చేస్తే  ఆ వ్యక్తిని శిక్షించడం తప్పు  కాదు. అలాగే, ఏదో ఒక రోజు వాళ్లకు తగిన శిక్ష పడుతుందని నమ్మడమూ తప్పు కాదు. అయితే వాళ్లకు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటారు? నిజానికి వాళ్లకు అల్ రడీ పెద్ద శిక్ష పడింది. వాళ్లను అసహ్యంగా తిట్టడం, మాట్లాడకుండా మౌనంగా ఉంటూ. సైలెంట్ ట్రీట్ మెంట్ చేసేశారు. ఇంకా వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలి? మీరు ఇన్ని చేసినా.. వాళ్లలో కొంచెం అయినా పశ్చాత్తాపం కలుగుతుందా? అంటే కలగదు! 

Also Read :- జనవరి 25 షట్ తిల ఏకాదశి

ఎందుకంటే మనుషులు ఏం చేయాలని కోరుకుంటారో. అదే చేస్తుంటారు. అంతేకానీ, ఎదుటి వాళ్లు కోరుకున్నది చేయరు. ఎదుటి వాళ్ల ఇంట్రెస్ట్ తో  వాళ్లకు సంబంధం లేదు. ఇది రైటా? కాదా? అని దీని నైతికత జోలికి నేను వెళ్లడం లేదు... అసలు పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఎవరో ఒకరు వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. వాళ్లు చట్ట వ్యతిరేక పనులేం చేయడం లేదు. కానీ, మీకు ఇప్పుడు అది నచ్చలేదు కాబట్టి వాళ్లకు శిక్షపడాలి. అంటే వాళ్లను అపార్ధం చేసుకుంటున్నాదన్నమాట. 

దేవుడిని ఎందుకు  ప్రేమిస్తారు 

భార్య..భర్తలను జీవిత భాగస్వాములు అంటాం.. అలాంటి వారు కూడా పనులు పంచుకోవడానికి ముందుకు రారు. కాబట్టి ఇష్టంగా ప్రేమించడానికి దేవుడ్ని ఎందుకుంటారు. ఆయన్ని ఎలాగైనా ప్రేమించొచ్చు. ఇది మీ ఇష్టం. వరుసగా పది రోజులు ఆయన గురించి ఆలోచించి. పదకొండో రోజు ఆయన గురించి ఆలోచించకపోయినా ఆయన అలాగే ఉంటాడు.  మీ భర్త లేదా భార్య అలాగే ఉంటారా? రోజూ ఉన్నట్లు. ..ఒక రోజు లేకపోతే ఏదో ఒక గొడవ అవుతుంది. మీరు ఎక్కడికో  వెళ్లిపోయారు. మూడేళ్ల పాటు దేవుడ్ని మర్చిపోయారు. మళ్లీ ఆలిచిస్తే ఆయన అలాగే ఉంటాడు. మీకు స్థిరమైన ప్రేమ కావాలంటే.. మీరు ప్రేమించడానికి  మనుషులకు ఎంచుకోకూడదు.

లోతుగా చూసినప్పుడు 

ఎవరైనా మీ జీవితంలోకి వచ్చేముందు వెంటనే దానికి రియాక్ట్ కావడానికి బదులు.. దాన్ని లోతుగా చూడాలి. ఎవరినో శిక్షించడం వల్ల మీ జీవితం అందంగా మారదు. ఏదో ఒక జబ్బు లాంటి సంతృప్తి కలుగుతుంది. అది కూడా రెండు రోజులు అంతే..! తర్వాత దానికీ గట్టిగా ఫీలవుతారు.  మొదట్లో ఆ ఎమోషన్ సంతృప్తిగా అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే సిగ్గుపడతారు. కాబట్టి, ఆదారిలో వెళ్లొద్దు. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక మందిరం తలుపు తట్టే అవకాశం మీకు కలిగిందని భావించాలి. ఎవరో ఒకరు మిమ్మల్ని రియలైజ్ చేస్తారు. 

-వెలుగు,లైఫ్-