Vastu tips: దక్షిణం దిక్కున వీధిపోటు ఉంటే ఏమి చేయాలి..?

Vastu tips:  దక్షిణం దిక్కున వీధిపోటు ఉంటే ఏమి చేయాలి..?

ఇల్లు కట్టుకొనేటప్పుడే కాదు.. స్థలం కొనేటప్పుడు వాస్తును పాటించాలి.  ఆ స్థలం ఏ ఆ కారంలో ఉంది. పొడవు ఎంత .. వెడల్పు ఎంత.. ఈశాన్య భాగం ఎలా ఉంది.. ఆస్థలానికి వీధిపోటు ఉందా.. ఉంటే ఎలా ఉందో వాస్తు ప్రకారం  చూసుకొని కొనుగోలు చేయాలని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు. 

ప్రశ్న:  ఇంటికి తూర్పు దిక్కున వీధి ఉండి... అది దక్షిణం వెళ్లి ఎండ్​ అయి...  ఆ ఇంటికి  కర్క్​గా వీధి పోటు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

జవాబు.. దక్షిణ దిక్కులో వీధిపోటు ఉన్న స్థలంలో వాస్తుప్రకారం ఇల్లు కట్టుకున్నా కొన్ని ఇబ్బందులు తప్పవు.  తరచుగా సమస్యలు వస్తాయనివాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.  సొంతింటికి వీధిపోటు ఉండటం మంచిది కాదు. దాని వల్ల చాలా సమస్యలొస్తాయి. అభివృద్ధి ఉండదు. అనారోగ్య, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటికి దూరంగా వీధిపోటు ఉన్నా, కొంతమేర అయినా ప్రభావం పడుతుంది. అందుకని ఇంటికి ఎదురుగా వినాయకుడి బొమ్మ పెట్టుకోవడం మంచిది. దీని వల్ల కొంతైనా ప్రభావం తగ్గుతుందని ఆయన అంటున్నారు. 

ALSO READ | Holy 2025: వింత ఆచారం: కొత్త అల్లుడు హోలీ రోజు ఆ ఊరు వెళ్లాడా..గాడిదపై ఊరేగాల్సిందే...!