
‘వాట్ ద ఫిష్’ అనే డిఫరెంట్ టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు వరుణ్ కోరుకుండ. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ ట్యాగ్‌లైన్‌తో విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిహారిక కొణిదెల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఇతర నటీనటులను సోమవారం అనౌన్స్ చేశారు. యాక్టర్స్ సత్య, అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీలకు వెల్కమ్ చెబుతూ వారి పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన నిహారిక, వెన్నెల కిశోర్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్, హిలేరియస్ ఎంటర్‌టైనర్. భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. వివిధ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.