Good Health : ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే ఏం చేయాలి

Good Health : ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే ఏం చేయాలి

వర్కవుట్స్ చేస్తే ఫిజికల్ గా ఫిట్ అవుతాం. అంతేకాదు యాంగ్జెటీ వంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయట. ఎక్సర్ సైజ్ చేసినప్పుడు కండరాల కదలికల వల్ల, రక్తప్రసరణ పెరుగుతుంది. వర్కవుట్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏమంటే.. మెదడులో ఫీల్గుడ్ హార్మోన్లు అయిన ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి యాంగ్జెటీని తగ్గిస్తాయి అంటున్నారు క్లినికల్ సైకాలజిస్టులు. 

ఈ మధ్య ఎక్కువ మందికి ఉంటున్న మానసిక సమస్యల్లో యాంగ్జెటీ డిజార్డర్ ఒకటి. వర్కవుట్స్ చేస్తే ఈ డిజార్డర్ నుంచి బయటపడొచ్చని 'జర్నల్ ఆఫ్ అఫెక్టివ్
డిజార్డర్'లో వచ్చిన ఒక  స్టడీ చెస్తోంది.  స్టడీ కోసం డిజార్డర్ తో బాధపడుతున్న 286 మందిని తీసుకున్నారు. వీళ్ల సగటు వయసు 39 ఏళ్లు. వీళ్లలో
70శాతం మంది ఆడవాళ్లు. పార్టిసిపెంట్స్ ని రెండు గ్రూప్స్ చేసి, 12 వారాలు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు. ఒక గ్రూప్ వాళ్లని లో-ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలని, రెండో గ్రూప్ వాళ్లని మీడియం లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వీళ్ల హార్ట్ బీట్, బ్లడ్ ప్రెజర్, బాడీ టెంపరేచర్ వంటివి చెక్ చేశారు. వీళ్లలో దాదాపు సగం మంది పదేండ్లకు పైగా యాంగ్జెటీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది. 

స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లేకున్నా..

టెన్షన్, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? అనేదాని మీద యాంగ్జెటీ ఆధారపడి ఉంటుంది. స్ట్రెస్ కారకాలు లేకున్నా కూడా కొందరు స్ట్రెస్లో ఉన్నట్టే ప్రవర్తిస్తారు. వీళ్లకు ఆలోచనల మీద కంట్రోల్ ఉండదు. యాంగ్జెటీ కారణంగా డయాబెటిస్, రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు.

యాంగ్జెటీ డిజార్డర్ లక్షణాలు

టెన్షన్ పడడం, రెస్ట్ లేకపోవడం, నెర్వస్ గా కనిపించడం, భయం వేయడం వంటివి. యాంగ్జెటీ లక్షణాలు. కొందరికి 'ఫైయింగ్ ఫోబియా' ఉంటుంది. మరికొందరు నలుగురిలో కలవాలంటే ఇబ్బందిగా ఫీలవుతారు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, పోషకాలున్న ఫుడ్, తినడం, కంటినిండా నిద్రపోవడం ద్వారా యాంగ్జెటీని తగ్గించుకోవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు.