ఈరోజుల్లో పొద్దున లేవగానే సోషల్ మీడియా అప్డేట్స్ చూడడం అలవాటుగా మారింది చాలామందికి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో.. పోస్ట్ లేదా ఫొటో పెట్టి, దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎంతమంది కామెంట్ చేశారు? అని పదే పదే చెక్ చేసుకుంటారు కొందరు. దాంతో, వాళ్లు డిప్రెషన్, యాంగ్జైటీకి లోనవుతారు. ఒక వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సోషల్ మీడియా డీటాక్స్ నుంచి బయట పడొచ్చు అంటున్నారు పరిశోధనలు చేస్తున్న రీసెర్చర్లు.
‘సైబర్ సైకాలజీ బిహేవియర్ అండ్ సోషల్ నెట్ వర్కింగ్’ అనే జర్నల్లో వచ్చిన స్టడీ ఇదే చెప్తోంది. లండన్ లోని బాత్ యూనివర్సిటీ రీసెర్చర్లు సోషల్ మీడియా డీటాక్స్ మీద రీసెర్చ్ చేశారు. స్టడీ కోసం సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించే 18 నుంచి 72 ఏండ్ల వయసు ఉన్న154 మందిని తీసుకుని రెండు గ్రూప్లుగా చేశారు. ఒక గ్రూప్ వాళ్లని వారం రోజులు సోషల్ మీడియాకి దూరంగా, రెండో గ్రూప్ వాళ్లని వారానికి 8 గంటలు సోషల్ మీడియాలో ఉండేలా చూశారు. వారం తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉన్నవాళ్లు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు గమనించారు రీసెర్చర్లు.