దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేవి స్వీట్స్, గిఫ్ట్, ఉద్యోగుల కోసం కంపెనీలు కూడా స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ గా ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల ఆలోచనా ధోరణి మారిపోయింది. కంపెనీలు ఇచ్చే ఆ డ్రైఫ్రూట్స్, స్వీట్స్ ను బహుమతులు అనుకోవడం లేదంట ఎంప్లాయిస్.. దీపావళికి ఉద్యోగులు ఎలాంటి గిఫ్ట్స్ కోరుకుంటారనే అంశంపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది ఎంప్లాయిస్.. స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ బహుమతులుగా అవసరం లేదని చెప్పారు. తొమ్మిది శాతం మంది తమకు వచ్చే దీపావళి గిఫ్ట్ నచ్చకపోవడం, ఉపయోగం లేకపోవడంతో మరొకరికి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు.
ALSO READ : Diwali 2024 : దీపావళి స్వీట్స్.. మలై లడ్డు..కాజు కట్లీ..చావల్ కీర్..బిస్కెట్ లడ్డు ఇంట్లోనే తయారు చేసుకోండి
సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది ఉద్యోగులు తమ కంపెనీ నుంచి ఆన్ లైన్ గిఫ్ట్ కార్డును దీపావళి బహుమతిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. 32 శాతం మంది మాత్రం క్యాష్ బోనస్, 11 శాతం మంది గృహోపకరణాలు, 6 శాతం మంది రెస్టారెంట్ వోచర్లను దీపావళి గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేవలం 5శాతం మంది మాత్రమే తాము స్వీట్స్.. డ్రై ఫ్రూట్స్ ను గిఫ్ట్ కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు ఏదో ఒక గిఫ్ట్ ను రుద్ధేయకుండా, వారి అభిరుచికి తగ్గట్టు బహుమతులు ఇవ్వాలని సర్వే సంస్థ సూచిస్తోంది. . .