Women's Day 2025 : 2186 సంవత్సరం నాటికి ఏం జరగబోతుంది.. అప్పుడు మహిళా దినోత్సవం స్పెషల్ ఏంటీ..?

Women's Day 2025 : 2186 సంవత్సరం నాటికి ఏం జరగబోతుంది.. అప్పుడు మహిళా దినోత్సవం స్పెషల్ ఏంటీ..?

స్త్రీలు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించడంతో పాటు మహిళా సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  ( మార్చి 8) నిర్వహించుకుంటాము. 2186 వసంవత్సరం నాటి స్పెషల్​ ఏంటి..  ఆ ఏడాది ఏం జరగుబోతుంది..  మార్చి 8 అంతర్జాతీయ మహిళదినోత్సంపై స్పెషల్​ స్టోరీ. . .

 మహిళా దినోత్సవం గురించి 

లేడీస్ ఫస్ట్.. అని ఏదో నోటి మాటగా చెప్పి...  జోకులు వేసుకునే రెస్పెక్ట్ కాదు ఆడవాళ్లు మగవాళ్లనుంచి కోరుకుంటున్నది. పబ్లిక్ ప్లేసుల్లో, ఆఫీసుల్లో, ఇంట్లో.. అన్ని చోట్లా మనుషులుగా కనీస గౌరవం కావాలంటున్నారు. చెల్లి, అక్క, భార్య, అమ్మ... ఇలా ఇంట్లోనే  .. మీకేం తెలుసులే ..  అని తక్కువచేసే మగవాళ్లున్న సమాజంలో.. రెస్పెక్ట్ అన్నింటికంటే ముందు ఆ ఇంట్లోనుంచే మొదలవ్వాలని కోరుకుంటున్నారు. 

జెండర్ గ్యాప్ 

సంవత్సరాలు వస్తున్నాయ్. పోతున్నాయ్. ఏటా మార్చి 8న ఒకటే హడావిడి. కానీ, ఆ తర్వాత అంతా మామూలే. కేవలం ఒకేఒక్క రోజు మహిళలను ఆకాశాన్ని ఎత్తి... తర్వాత రోజుల్లో బానిసల్లా చూడటం ఎంత వరకు కరెక్ట్? మహిళలపై వేధింపులు తగ్గుతు న్నాయా? మగవాళ్లతో సమానంగా అవకాశాలు పెరుగుతున్నా యా?.. మహిళలపై పెరిగిపోతున్న నేరాలు (ముఖ్యంగా పని ప్రదేశాల్లో...) లింగ సమానతకు అడ్డుపడుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

జెండర్ గ్యాప్ ముగిసిపోవడానికి మరో వందే ళ్లకు పైనే(2186 ఏడాదికల్లా) పడుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆ మధ్య వెల్లడించింది. మీటూ లాంటి ఉద్యమాలు గళం వినిపించేందుకు ఉపయోగపడుతున్నా వాటి ఫలితం మాత్రం ప్ర తికూల ప్రభావాన్నే చూపిస్తున్నాయని మేధావులు వాపోతున్నారు. 'సమానత్వం కోసం మహిళలు చేస్తున్న పోరాటం ఫెమినిస్టులదో లేదంటే సంస్థలదో కాదు. మానవ హక్కులను పరిరక్షించుకునేం దుకు ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలు పంచు కోవాలి. అప్పుడే లింగ సమానత్వం సాధ్యమవుతుంద'ని సోషల్ యాక్టివిస్ట్ గ్లోరియా స్టెయినెమ్ అభిప్రాయపడుతోంది.

ALSO READ : Women's Day 2025 : మహిళా దినోత్సవం ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ పుట్టిందో ఎంత మందికి తెలుసా..!

ఆడవాళ్ల విషయంలో మగవాళ్లు చేస్తున్న  పని.. వాళ్లను కొన్నిసార్లు మనుషులుగా కూడా గుర్తించకపోవడం. ఏ కోపం ఉన్నా దాన్ని ఇంట్లో ఆడవాళ్ల మీద తీర్చుకునే మగవాళ్లు లెక్కలేనంత మంది ఉన్నారు. అలాంటి  వాళ్లనుంచి స్త్రీ సమాజం కనీస గౌరవాన్ని కోరుకుంటోంది. ముందు రెస్పెక్ట్ అంటూ ఒకటి ఇస్తేనే కదా... ఈక్వాలిటీ వైపుకు మనం అడుగులు వేయగలిగేది! 

స్త్రీ అంటే శక్తి స్వరూపం. ఆమె ఉన్న చోట ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంటికి, సమాజానికి వెలుగు మహిళే. నేడు స్త్రీలు అడుగుపెట్టని రంగం లేదు. అన్ని రంగాలలో తమ ముద్ర వేసుకుంటూ పురుషులతో సమానంగా పనిచేస్తూ లింగ సమానత్వ సూత్రాన్ని ప్రోత్సహిస్తున్నారు.