- ఆగమేఘాల మీద తయారీ, ఇష్టారీతిన మార్పులతో సమస్య
- కొద్ది రోజులుగా మొరాయిస్తున్న సర్వర్
- ఉన్న దాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసీ పాట్లు
- అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెర్రాసిస్ సహాయ నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌ను ప్రైవేట్ కంపెనీ టెర్రాసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్స్సెంటర్)కి అ ప్పగించాక.. ఆ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆచితూచి అడుగువేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మాత్రం అటీటైనా ల్యాండ్‌మైన్ మాదిరి మొత్తం పోర్టల్క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలిసింది. అంతకుముందు ధరణి పోర్టల్‌ను ఆగమేఘాల మీద తయారు చేసి, నిర్వహించిన టెర్రాసిస్.. ఒక పద్ధతి ప్రకారం బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించకపోవడం, ఎప్పటికప్పుడు కోడింగ్‌లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు ఎన్ఐసీ నిపుణులు చెబుతున్నారు.
మాడ్యూల్స్‌ను తగ్గించడం కత్తిమీద సామే..
గత నెలలోనే ధరణి పోర్టల్‌కు సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ డేటా టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి బదిలీ అయింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ధరణి పోర్టల్సర్వర్ మొరాయిస్తుండడంతో వివిధ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈ సమస్యను నివారించేందుకు సర్వర్‌ను రీస్టార్ట్ చేయలన్నా ఎన్ఐసీ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సర్వర్‌ను రీస్టార్ట్ చేస్తే ఎక్కడ, ఏ డేటా ఎగిరిపోతుందో తెలియట్లేదని ఎన్ఐసీ టెక్నీషియన్స్అంటున్నారు.
Also Read :- రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం
ప్రస్తుతం ధరణిలో 33కు పైగా మాడ్యుల్స్ఉండగా.. వాటిని తగ్గించాలన్నా, వాటిల్లో మార్పులు చేయాలన్నా ఒకటికి పది జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల వరకు టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎన్ఐసీకి టెర్రాసిస్ సంస్థ కొంత సమాచారం ఇస్తూ వచ్చింది. అయితే ఇటీవల భూభారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టెర్రాసిస్పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుంచి ధరణి సాఫ్ట్ వేర్కోడింగ్కు సంబంధించి ఏ సమాచారం అడిగినా టెర్రాసిస్ స్పందించడం లేదని తెలిసింది.
భూభారతి రూల్స్ తర్వాత మాడ్యుల్స్లో మార్పులు
ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం తేవడంతో అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ కొత్త నిబంధనలు రూపొందిస్తున్నది. ఈ రూల్స్ప్రకారమే ధరణి పోర్టల్ మాడ్యుల్స్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 33 మాడ్యుల్స్‌ను 6కు కుదించనున్నారు. ఆన్లైన్లోనే పహాణీల ఎంట్రీతో పాటు ఎంజాయ్మెంట్కాలమ్ తో కూడిన 11 అంశాలతో రికార్డు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఇదంతా చేయాలంటే ధరణిలో సాఫ్ట్వేర్ కోడింగ్‌లో కచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
ఇందుకు టెర్రాసిస్సహకారం తప్పనిసరి. అయితే ఆ సంస్థ సహకారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా టెర్రాసిస్ కు పెండింగ్‌లో ఉన్న బకాయిలను రిలీజ్ చేయకుండా లీగల్ నోటీసులు పంపించి ధరణి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి కోడింగ్‌లో మార్పులకు సహకారం తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్తున్నరు. అప్పటిదాకా ధరణి పోర్టల్‌ను ఉన్నది ఉన్నట్టుగా రన్చేస్తామని అంటున్నారు. టెర్రాసిస్గతంలో మాదిరి సహకరిస్తే కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ముందుకు వెళ్లాలనేది ఆఫీసర్ల ఆలోచనగా తెలుస్తున్నది. అంటే కొంతకాలం వరకు ప్రస్తుతమున్న ధరణి పోర్టల్ ను రన్చేస్తూనే.. భూభారతి చట్టానికి అనుగుణంగా ఇంకో సాఫ్ట్వేర్ తయారు చేయించి కొత్త పోర్టల్ తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.