‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ ఇన్స్టాలో వైరల్ అవుతోంది. ఎందుకు ట్రెండింగ్లో ఉంది..?

ఆల్ ఐస్ ఆన్ రఫా..ఇపుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఒకేఒక చిత్రం. ఏ ఫ్లాట్ ఫాంలో చూసినా ఇదే.. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ హల్ చల్ చేస్తోంది. ఇజ్రాయిల్ చేసిన దాడుల తర్వాత  రఫా శరణార్థుల దుస్థితిని ఎత్తి చూపుతోంది. ఇన్స్టా గ్రామ్ వేదికగా సెలబ్రిటీలతో సహా మిలియన్ల కొద్ది యూజర్లు సౌత్ గాజాలోని రఫాసిటీ దుస్థితిపై ఈ పోస్టును షేర్ చేస్తున్నారు. గాజాలోని రఫా నగరంలో జరిగిన పౌర ప్రాణనష్టం తర్వాత కాల్పుల విరమణకు గొంతెత్తి నినదిస్తున్నాయి.  మే 26 , 2024 న గాజాపై జరిగిన విధ్వంసకర వైమానిక దాడుల గురించి ఈ వైరల్ ఉద్యమం సాగుతోంది. రఫా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో టెంట్లతో ఇలా ‘ఆల్ ఐస్ ఆన్ రఫా ’పదాన్ని రూపొందించింది ఐక్యరాజ్యసమితి.

రఫా..ఈజిప్టు బార్డర్ లో ఓనగరం..ఇజ్రాయెల్, పాలస్తీనా  మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు సెంటర్ పాయింట్. ఇటీవల ఇజ్రాయెల్ గాజా పౌరులు తలదాచుకున్న శిబిరాలపై  వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో పిల్లలు, మహిళలతో సహా 45 మంది మరణించగా.. 2వేల మంది గాయపడ్డారు. ఈ క్రమంలో సోషల్ మీడి యాలో ఫొటో వైరల్ మారింది. ఇది "ఆల్ ఐస్ ఆన్ రఫా" అనే పదాలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన టెంట్లను చూపెడుతుంది. 

ఈ ఫొటోను ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ షేర్ చేసింది.ఈ పోస్ట్ ద్వారా పాలస్తీన శరణార్థుల భయంకరమైన పరిస్థితిని చూపింది. గాజా భూమి నరకంగా మారింది. అనేక కుటుంబాలు శరణార్థి శిబిరాలకు వస్తూనే ఉన్నారు. యుద్ధాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.. అయినా వారికి సురక్షితమైన స్థలం అంటూ ఏమీ లేదని యూఎన్ ఈ పోస్ట్ తో ట్యాగ్ చేసింది. 

ఈ ఫొటోలు కనిపిస్తున్నవన్నీ టెంట్లు.. గాజా శరణార్థులకోసం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. ఆల్ ఐస్ ఆన్ రఫా అని అర్థం వచ్చేలా పెద్ద టెంట్లతో యూఎన్   ఈ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్దంతో గాజా పౌరులు దుస్థితిని ప్రపంచానికి చెప్పేందుకు తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు భారీ ఎత్తున స్పందించారు.. మిలియన్ల కొద్దీ నెలిజనట్లు ఈ ఫొటోను షేర్ చేశారు. గాజాపై కాల్పుల విరమణ కోసం ఈ వైరల్ మూవ్ మెంట్ లో పాల్గొన్నారు. 

మరోవైపు ‘‘గాజాలో ఎవరూ సురక్షితంగా లేరు.. కాల్పుల్లో అనేక మంది పౌరులు చనిపోతున్నారు. ఎక్కువ మంది పిల్లలు, మహిళలు చనిపోతున్నారు.. మాకు కాల్పుల విరమణ అవసరం అని గాజా ఆరోగ్య శాఖ వేడుకొంది.అయినా అనంతరం జరిగిన దాడుల్లో 45 మంది పౌరులు చనిపోయారు.. వేలాది మంది గాయపడ్డారు.. గాజా దుస్థితికి సంబంధించిన భయంకరమైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇది లక్షలాది మంది కాల్పుల విరమణ పిలుపుకు దారి తీసింది. తద్వారా గాజాలో జరుగుతున్న మారణ హోమం దృష్టికి తీసుకురావడనికి ఈ ఫొటో పెత్త ఎత్తున  షేర్ చేస్తున్నారు సెలబ్రిటీలు, నెటిజన్లు.