
ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన బీజేపీనేత రేఖాగుప్తా కొత్త కారుపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె సీఎం అయిన రెండు రోజులకే కాస్ట్ లీ కారు MG గ్లోస్టర్ 4WD ని కొనుగోలు చేశారు. సీఎం కాగానే రూ.50లక్షల విలువైన కాస్ట్ లీ కారు కొన్నారంటూ కంటెంట్ జోరుగా స్పెడ్ అవుతోంది. అయితే ఇది నిజమా కాదా అని ఫ్యాక్ట్ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రాజకీయ నాయకుడు, ప్రముఖులతోపాటు ప్రజలకు సంబంధించిన తప్పుడు సమాచారం విస్తృతంగా వైరల్ అవుతోంది. దీంతో వారి వ్యక్తిగత, రాజకీయపరమైన ఆటంకాలు, వాస్తవాలను ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటివి జరుగుతున్నాయి. ఢిల్లీ సీఎం రేఖగుప్తా కారు కొనుగోలు విషయం కూడా అలాంటిదే అని తెలుస్తోంది.
अंधभक्तों मिर्ची क्यों लगी?
— Prem Kumar (@AskThePremKumar) February 23, 2025
यह ट्वीट इसलिए नहीं था कि 50 लाख की कार किसने खरीदी?
कथित शीश महल किसने बनवाया?
यह ट्वीट इसलिए था कि 'शीश महल' में नहीं रहने का एलान करने वाली सीएम रेखा गुप्ताजी क्या सड़क पर 'शीशमहल' बनाएंगी?
इस ट्वीट से अपेक्षा थी कि सीएम रेखा गुप्ता एलान करतीं… https://t.co/bTlwSnFF14
ఢిల్లీ రేఖా గుప్తాకు చెందిన కాస్ట్ లీ కారు కొనుగోలు మేటర్ ..X సోషల్ మీడియాలో ఢిల్లీకి చెందిన ఆప్ మద్దతుదారులు పోస్ట్ చేశారు. ఆమె ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో దుబారా చేస్తున్నారని, ఆమె చేసింది బాధ్యతారాహిత్యం అని xలో షేర్ చేశారు.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కారుకొనుగోలు వ్యవహారంల అసలు కథ ఏంటంటే.. ఈ కారు రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు చేపట్టముందే కొనుగోలు చేశారు. అధికారిక రిజిస్ట్రేషన్ వివరాలు ప్రకారం.. 2022లోనే కొనుగోలు చేశారు. అప్పుడే రిజిస్ట్రేషన్ కూడా చేయబడింది. అప్పుడు ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఈ వాహనం ఇటీవలే కొనుగోలు చేయబడిందనే తప్పుదారి పట్టించే కథనం అని తెలుస్తోంది.
Also Read : ఆప్‌లో చేరిన స్టార్ యాక్టర్ సోనియా మాన్
ఇటీవల కాలంలో ఇలాంటి సోషల్ మీడియా కంటెంట్ ఎక్కువయింది. ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఉపయోగించడంపై పెరుగుతున్న ఆందోళనకు హైలైట్ చేస్తోంది. ఇటువంటి కంటెంట్ తో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. వాస్తవాలనుంచి దృష్టి మళ్లించడం, ప్రజల సెంటిమెంట్ తారుమారు అయ్యే అవకాశం ఉంది. సామాజిక భద్రత విషయంలో కూడా ప్రజల్లో అనవసరమైన చీలికలు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.