
- నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖాతాలపై చర్యలు
న్యూఢిల్లీ: ఇండియన్లకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నెలలో మొత్తం 99 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. నింబంధనలకు విరుద్ధంగా కంటెంట్‌ను సర్క్యూలేట్ చేయడంతో చర్యలు తీసుకుంది. ఫ్లాట్‌ఫారమ్ సెక్యూరిటీని పెంచేందుకు, స్పామ్, స్కామ్స్‌ను నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. 2025 జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు 99 లక్షలకు పైగా ఇండియన్ల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేశామని కంపెనీ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.
99 లక్షల నిషేధిత ఖాతాల్లో అనుమానాస్పద అకౌంట్లపై కస్టమర్లు ఫిర్యాదు చేయడానికి ముందే దాదాపు 13.27 లక్షల అకౌంట్లను బ్యాన్ చేశామని చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు వాట్సాప్ అకౌంట్లను మాతృసంస్థ మెటాకు ఉన్న ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా బ్యాన్ చేశామని నివేదికలో వెల్లడించింది. జనవరిలో 9,474 ఫిర్యాదులు రాగా, అందులో 239 అకౌంట్లను పర్మినెంట్‌గా నిషేధించామని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆపరేట్ అయ్యే వాట్సాప్ అకౌంట్లను గుర్తించేందుకు మూడు కీలక దశలు పనిచేస్తాయి.