ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ 18 లక్షలకు పైగా ఇండియన్ల ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. వినియోగదారుల ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. '2022 జనవరి 1-31వ తేదీ వరకు వినియోగదార్ల నుంచి వాట్సాప్ గ్రీవెన్స్ సెల్‌కు 495 భారతీయ ఖాతాలపై ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదుల్లో 285 అకౌంట్లను రద్దు చేయాలని వినతులు వచ్చాయి. వాటిలో ఖాతాదారుల ఫిర్యాదు మేరకు... 24 ఖాతాలను రద్దు చేయడం జరిగింది. వాట్సాప్ యాప్‌లో పొందుపరిచిన టూల్స్, ఇతర వాటితో దురుసుగా వ్యవహరించిన యూజర్ల ఖాతాలను ఐటీ నిబంధనలు 2022 ప్రకారం 18.58 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకున్నాం' అని వాట్సాప్ తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..