ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సెప్టెంబర్ నెలలోనే 85 లక్షల మంది అకౌంట్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని వాట్సాప్ నెలవారీ నివేదికల్లో వెల్లడించింది. అంతేకాదు.. వాట్సాప్ సెప్టెంబర్ మంథ్లీ రిపోర్ట్ లో16.58 లక్షల అకౌంట్లు ముందస్తుగా నిషేధించబడినట్లు ప్రకటించింది-. యూజర్ల ఫిర్యాదులతో స్వతహాగా ఈ నిర్ణయం తీసున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021కు విరుద్ధంగా ఉన్న భారతీయుల వాట్సాప్ ఖాతాలను మెటాసంస్థ బ్యాన్ చేసింది.
Also Read :- నవంబర్ 7వరకు సూపర్ వాల్యూ డేస్
నిబంధనలకు కట్టుబడి ఉండని 85లక్షల మంది వాట్సాప్ అకౌంట్లు ఒక్క సెప్టెంబర్ నెలలోనే బ్యాన్ చేశారు. మీడియేటర్ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ లోని రూల్స్ ను ఇల్లంఘించినట్లు ఆ సంస్థ పేర్కోంది. అదే నెలలో వాట్సాప్‌కు మొత్తం 8,161 ఫిర్యాదులు అందాయని, ఫలితంగా వీటిలో 97 కేసులపై చర్యలు తీసుకున్నట్లు నివేదికల్లో ప్రకటించింది వాట్సాప్. ఇంకా, గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ జారీ చేసిన రెండు ఆదేశాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.
IT రూల్స్ 2021
కొత్త IT రూల్స్ 2021 ప్రకారం.. భారతదేశంలో 50వేల కంటే ఎక్కువ యూజర్ బేస్ ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా నెలవారీ సపోర్ట్ రిపోర్ట్ ను ప్రచురించాలి. యూజర్ల రిపోర్ట్ అకౌంట్లు, ప్లాట్‌ఫారమ్ తీసుకున్న చర్యలు, ఫిర్యాదుల అప్పీలేట్ కమిటీ అందించిన ఏవైనా మార్గదర్శకాల వివరాలను వివరించడానికి ఈ నివేదిక అవసరం.