
ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న చాటింగ్ యాప్ వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్స్ ను తీసుకొచ్చింది. కొత్త థీమ్స్, వాల్ పేపర్స్ ను కస్టమర్స్ కోసం తీసుకొచ్చింది. దీంతో ఇదివరకు లేనంత స్టైలిష్ గా చాట్స్ ఉండనున్నాయి. ఒకటి రెండు వారాల్లో ఈ న్యూ ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి.
చాటింగ్ చేస్తున్న టైమ్ లో అద్భుతమైన ఫీల్, వైబ్రంట్ టచ్ రావాలంటే ఈ ఫీచర్స్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్డేట్స్ ఇవే:
చాట్ థీమ్స్:
చాట్ బబుల్స్, బ్యాగ్రౌండ్స్ ను ఈజీగా చేంజ్ చేసుకునే ఆప్షన్ వాట్సాప్ తాజాగా తీసుకొచ్చింది. అందుకోసం ఆటోమేటిక్ గా ప్రీసెట్ థీమ్స్ ను ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా ఎక్ట్రా లుక్ రావాంటే థీమ్ లో నచ్చిన కలర్స్ తో మార్పులు చేసుకోవచ్చు. సింపుల్ గా, ఫన్ గా ఉండేందుకు, ఫీల్ గుడ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫీచర్ ను లాంచ్ చేస్తోంది వాట్సాప్.
వాల్ పేపర్స్:
కొత్త గా వచ్చే అప్ డేట్స్ ప్రకారం వాట్సాప్ మొత్తం 30 కొత్త వాల్ పేపర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. మూడ్ కు తగినట్లుగా వాల్ పేపర్స్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవచ్చు.
ALSO READ | Gold Rates Today: బంగారం మళ్లీ పెరిగింది.. హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయంటే..