Technology : స్టేటస్కు మ్యూజిక్​ యాడ్.. వాట్సాప్ మరో సూపర్ ఫీచర్

Technology : స్టేటస్కు మ్యూజిక్​ యాడ్.. వాట్సాప్ మరో సూపర్ ఫీచర్

ఇన్​స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్​లో స్టేటస్ పెట్టకుండా రోజు గడవదు చాలామందికి. మంచో, చెడో ఏదైనా సరే అందరికీ తెలియాలంటే స్టేటస్ పెట్టాల్సిందే. ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ ద్వారా స్టేటస్ అప్​లోడ్ చేస్తుంటాం. అయితే స్టేటస్​కి మరో ఫీచర్ జోడించింది వాట్సాప్. అదే మ్యూజిక్. 

వాట్సాప్​ యూజర్లు ఇక నుంచి స్టేటస్ పెట్టేటప్పుడు తమ ఫేవరెట్​ మ్యూజిక్​ను కూడా​ స్టేటస్​కి యాడ్​ చేయొచ్చు.  దీన్ని ఎలా వాడాలంటే.. స్టేటస్​లో పిక్చర్ లేదా టెక్స్ట్​ను అప్​లోడ్ చేసేటప్పుడు డ్రాయింగ్ ఎడిటర్​లో కలర్ ఛేంజ్, టెక్స్ట్​, ఎమోజీ, క్రాప్​తో పాటు ఎడమవైపు ఈ కొత్త మ్యూజిక్​ ఐకాన్ కనిపిస్తుంది. 

ఈ ఆప్షన్​పై ట్యాప్ చేసి, నచ్చిన సాంగ్స్ లేదా ఆర్టిస్ట్​ కోసం సెర్చ్ చేసి దాన్ని సెలక్ట్​ చేసుకోవాలి. దాంతో ఆటోమెటిక్​గా అది స్టేటస్​కు యాడ్ అయిపోతుంది. యూజర్లు వాట్సాప్​ స్టేటస్​లో ఫొటోలు, వీడియోలు రెండింటికీ ఈ మ్యూజిక్​ను యాడ్ చేయొచ్చు.  ప్రస్తుతం ఈ ఫీచర్​ ఆండ్రాయిడ్​ ఫోన్​లలో అందుబాటులోకి రానుంది. 

మూడు యాప్​లలో స్టోరీలుగా.. 

ఒకే స్టేటస్​ని మూడు యాప్​లలో స్టోరీలుగా పెట్టుకునే వీలు కల్పించనున్నట్టు తెలిపింది కంపెనీ. వాట్సాప్​ స్టేటస్​ని ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ల​లో కూడా స్టోరీలుగా పెట్టుకోవచ్చట. ఇందుకోసం ఆ యాప్​లకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్టేటస్ ఆప్షన్​లోనే ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ లింక్స్​కి సంబంధించిన ఐకాన్స్ కనిపిస్తాయి.

 ముందుగా ఆ యాప్​లను ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో ఏ యాప్​లో స్టేటస్​ని స్టోరీగా అప్​లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్​ అందరికీ అందుబాటులోకి రానుంది.