WhatsApp వినియోగదారులు భద్రతను అందించే ఎన్ క్రిప్షన్ తో వాయిస్, వీడియో కాల్స్ చేయొచ్చని మనకు తెలుసు. ఇప్పుడు వాట్సప్ ఓ అడుగు ముందుకు వేసి మేసేజింగ్ ఫ్లాట్ ఫామ్ ద్వారా కాల్స్ చేస్తున్నపుడు IP అడ్రస్ లను కనిపించకుండా దాచేందుకు కొత్త ఫీచర్ ను తెస్తోంది. ఆండ్రాయిడ్, iOS డివైజ్ ల కోసం కొత్త అప్ డేట్ ద్వారా ఫీచర్ ఈ వారంలో అందుబాటులోకి వస్తుంది.
దీంతో పాటు వాట్సప్ వినియోగదారులకు తెలియని నెంబర్లనుంచి కాల్స్ వస్తే మ్యూట్ చేసే ఎంపికను కూడా అందిస్తోంది. సైబర్ స్కామ్ ఎక్కువవుతున్న ఈ టైంలో వాటి బారిన పడకుండా ఉండేందుకు ఇంది మంచి ఆప్షన్. సైబర్ దాడుల నుంచి వినియోగదారుడిని రక్షించడానికి చేపట్టిన చర్యలు, జాగ్రత్తలను మేసేజింగ్ యాప్ వాట్సప్ షేర్ చేసింది.
ఈ ఫీచర్ ద్వారా ఉపయోగం ఏంటీ అంటే.. డేటా బదిలీ వేగవంతం, కాల్స్ నాణ్యత పెంపొందించడానికి IP అడ్రస్ అవసరం. అయితే ఇది సరియైన IP అడ్రస్ కు మాత్రమే మీ ఐపీ అడ్రస్ ను అందించేందుకు డివైజ్ కు అనుమతిస్తుంది.
ఈ వివరాల ద్వారా యూజర్ లోకేషన్, ఇంటర్నెట్ అందిస్తున్న ప్రొవైడర్ ను కూడా గుర్తించడం సులభం. ఈ ఫీచర్ ప్రారంభించబడితే.. మీ చేస్తున్న అన్ని కాల్స్ వాట్సప్ సర్వర్ల ద్వారా ప్రసారం అవుతాయి. కాల్ లోని ఇతర పార్టీలు మీ IP అడ్రస్ ను చూడలేవు. ఈ ఫీచర్ ను డీఫాల్ట్ గా ఇవ్వడంలేదు.. మీకు ప్రత్యేకమైన కాల్స్ చేసేందుకు ఒక ఆప్షన్ గా ఇస్తోంది. వాట్సప్ ఈ ఫీచర్ గురించి క్లియర్ గా చెప్తుంది ఏంటంటే.. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేస్తే.. కాల్ క్వాలిటీ తగ్గుతుందని స్పష్టం చేస్తోంది.
Whats App లో కాల్స్ కోసం ఐపీ అడ్రస్ ను ఎలా దాచాలి ..
- ముందుగా మీ ఆండ్రాయిడ్, ఐఫోన్ లో వాట్సప్ అప్ డేట్ వెర్షన్ నిర్ధారించుకోవాలి.
- WhatsApp ఓపెన్ చేసి సెట్టింగ్ కోసం మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి.
- Secret పై క్లిక్ చేయాలి.
- అడ్వాన్స్ డ్ కి క్రిందికి స్క్రోల్ చేసి.. కాల్ ఫీచర్ లో ప్రొటెక్ట్ IP అడ్రస్ ను ప్రారంభించాలి. అంతే మీ ఐపీ అడ్రస్ హైడ్ చేయబడుతుంది.