కొత్త ప్రైవసీ పాలసీ మంచిదే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మెసేజ్‌‌లు చేస్కోండి

కొత్త ప్రైవసీ పాలసీ మంచిదే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మెసేజ్‌‌లు చేస్కోండి

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ డేటాను ఫేస్‌‌బుక్‌‌తోపాటు ఇతర డిజిటల్ ప్లాట్‌‌ఫామ్స్‌‌లో వాడుకుంటాననడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి ఇతర ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్స్‌‌కు మారుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వాట్సాప్ స్పందించింది. ప్రైవసీ పాలసీపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేలా ఓ అఫీషియల్ స్టేట్‌‌మెంట్ రిలీజ్ చేసింది. ప్రైవసీ అప్‌‌డేట్ యూజర్ల మీద ఎలాంటి ప్రభావం చూపబోదని, వాళ్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాటింగ్స్, కాలింగ్స్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.

‘మేం రీసెంట్‌‌గా మా ప్రైవసీ పాలసీని అప్‌‌డేట్ చేశాం. ఈ విషయం పై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మాకు కొన్ని ప్రశ్నలు కూడా అందాయి. ఇందులో కొన్ని కామన్ క్వశ్చన్స్‌కు మేం సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాం. ప్రజలు ప్రైవేటుగా కమ్యూనికేట్ చేసుకునేలా వాట్సాప్‌‌ను మేం డెవలప్ చేశాం. కొత్త ప్రైవసీ పాలసీ అప్‌‌డేట్‌‌ వల్ల మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చేసుకునే మెసేజ్‌‌లపై ఎలాంటి ప్రభావం పడబోదు’ అని వాట్సాప్ పేర్కొంది.