కొన్నేళ్ల నుంచి వాట్సాప్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఫీచర్‌ని తీసుకొస్తూనే ఉంది. టెక్నాలజీ మారిన కొద్దీ కొత్త ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. అందుకే ప్రపంచంలోనే టాప్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ ఎదిగింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీసీల్లో వాట్సాప్ వాడే వాళ్ల కోసం ఇప్పుడు మరిన్ని ఫీచర్లు తీసుకురానుంది మెటా. ఈ ఫీచర్లు మంచి చాట్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తాయని టెక్‌గురూలు చెప్తున్నారు. ఇప్పటికే వీటిలో చాలా ఫీచర్లు వాట్సాప్ బీటా ప్రోగ్రామ్ సబ్‌స్క్రయిబర్లకు అందుబాటు లోకి తీసుకొచ్చింది కంపెనీ.
అడ్మిన్‌ల కోసం చాట్ ఫీచర్
గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ల కోసం వాట్సాప్ కొత్త చాట్ ఫంక్షన్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గ్రూప్‌లో ఎవరు మెసేజ్ పెట్టినా అడ్మినిస్ట్రేటర్‌కు దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం మెసేజ్ పెట్టినవాళ్ల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మెసేజ్ డిలీట్ అయిన తర్వాత ఆ మెసేజ్‌ని అడ్మిన్ డిలీట్ చేసినట్టు గ్రూప్‌లో చూపిస్తుంది. ఈ ఫీచర్ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుంది.
టూ స్టెప్ వెరిఫికేషన్
వాట్సాప్ అకౌంట్ సెక్యూరిటీని పెంచడానికి మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వాట్సాప్‌ని డెస్క్‌టాప్‌లో వాడాలంటే ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్‌లో స్కాన్ చేయాలి. కానీ.. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వెబ్‌లో లాగిన్ చేసినప్పుడు కచ్చితంగా టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్‌ని కూడా ఎంటర్ చేయాలి.
కొత్త ఎమోజీస్
ఈ ఫీచర్ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అందు బాటులో ఉంది. ఇప్పుడు వాట్సాప్‌లో తీసుకొస్తున్నారు. అదే మెసేజ్ రియాక్షన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా సింగిల్ క్లిక్‌తో మెసేజ్‌లకు రిప్లైగా ఎమోజీలను పంపొచ్చు. దీనికోసం మెసేజ్‌పై ప్రెస్ చేసి ఉంచాలి. వెంటనే ఎమోజీస్ పాప్ అప్ వస్తుంది. అందులో ఏదైనా ఎమోజీని సెలక్ట్ చేసుకుంటే సెండ్ అవుతుంది.
వాయిస్ కాల్స్ కోసం కొత్త ఇంటర్‌ఫేస్
గ్రూప్ ఫోన్ కాల్స్ కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఇంటర్‌ఫేస్‌ను తీసుకురానుంది. గ్రూప్ కాల్ మాట్లాడినప్పుడు అందరికీ వాయిస్ వేవ్‌ఫామ్ కనిసిస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, ప్రొఫైల్ ఫొటో కనిపిస్తుంది. అంతేకాదు ఎవరు ఎంతసేపు మాట్లాడారనేది కూడా చూపిస్తుంది.
ఫొటో డాక్యుమెంట్స్ ప్రివ్యూ
ప్రస్తుతం వాట్సాప్ చాట్‌లలో డాక్యుమెంట్ మోడ్‌లో షేర్ చేసిన ఫొటోలు, వీడియోల ప్రివ్యూకి అవకాశం లేదు. చూడాలనుకుంటే ఓపెన్ చేయాల్సిందే. కానీ.. ఇకనుంచి ఓపెన్ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
స్టేటస్ షేర్
వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ని కూడా త్వరలోనే తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో ఒక ఫొటోను సెలక్ట్ చేసుకుని స్టేటస్ పెట్టుకోవచ్చు. అదే టైంలో షేర్ చేయొచ్చు. అంటే అదే ఫొటోను ఈ ఫీచర్‌తో ఒకేసారి చాట్‌లో ఇండివిడ్యువల్‌గా ఎవరికైనా పంపొచ్చు.
కమ్యూనిటీస్ ఫీచర్
గ్రూప్స్ అడ్మినిస్ట్రేటర్ల కోసం వాట్సాప్ ఈ కమ్యూనిటీ ఫీచర్‌ని తీసుకురానుంది. ఒక కమ్యూనిటీలో 10 చాట్ గ్రూప్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పది గ్రూపులకు ఒకేసారి మెసేజ్ పంపొచ్చు. అయితే,
ఈ ఫీచర్ కేవలం అడ్మిన్స్‌కు మాత్రమే ఇస్తున్నారు.