ఇప్పటి వరకు యాడ్ ఫ్రీ గా ఉన్న వాట్సాప్ లో వచ్చే ఏడాది నుంచి ప్రకటనలు రాబోతున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫేస్ బుక్ అడ్వర్టైజింగ్ హెడ్ ఒలివీర్ పోంటెవిల్లే తెలిపారు. 2020 నుంచి వాట్సాప్ స్టాటస్ లో ప్రకటనలు రానున్నట్టు నెదర్లాండ్ లో జరిగిన ఫేస్ బుక్ మార్కెటింగ్ సమ్మిట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇప్పటి వరకు వాట్సాప్ యూజర్లు తమ స్టాటస్ లలో వారికి నచ్చిన సందేశాన్ని, ఫోటోలను, వీడియోలను షేర్ చేసేవారు. ఇక వచ్చే ఏడాది నుంచి వారి స్టాటస్ లో ప్రకటనలు కూడా దర్శనమివ్వనున్నాయి.
WhatsApp will bring Stories Ads in its status product in 2020. #FMS19 pic.twitter.com/OI3TWMmfKj
— Olivier Ponteville (@Olivier_Ptv) May 21, 2019