ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్స్‌పై ‘వాట్సాప్’ డార్క్‌మోడ్ ఎప్పుడో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ఇప్పుడు డెస్క్‌టాప్‌పై కూడా అందుబాటులోకి వచ్చింది. మ్యాక్, విండోస్ ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్ వెర్షన్ వాడుతున్నట్లైతే లేటెస్ట్ ‘డార్క్‌మోడ్’ను ఎనేబుల్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌పై ‘వాట్సాప్ వెబ్’పై లాగిన్ అయ్యి, పక్కన కనిపించే ‘త్రీ డాట్’ ఐకాన్‌పై క్లిక్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘థీమ్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుటే డార్క్‌మోడ్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే చాలు. రాత్రిపూట కళ్లపై ఎఫెక్ట్ పడకుండా, డార్క్‌మోడ్ పనిచేస్తుంది. ఇది అక్కర్లేదనుకుంటే ‘లైట్ మోడ్’ సెలెక్ట్ చేసుకోవచ్చు.
మొబైల్‌పై అయితే డార్క్‌మోడ్ వాడితే, బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. డెస్క్‌టాప్‌పై ఈ ఫీచర్ వాడుకోవాలంటే మొబైల్‌లో లేటెస్ట్ వెర్షన్ యాప్ ఉండాలి. ఈ ఫీచర్‌తోపాటు మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
క్యూఆర్ కోడ్స్: ఈ ఫీచర్ ద్వారా ఎవరి మొబైల్ నెంబర్‌ను అయినా వాట్సాప్‌లోకి యాడ్ చేసుకోవాలంటే వాళ్ల నెంబర్ ఎంటర్ చెయ్యక్కర్లేదు. సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ల కోడ్ స్కాన్ చేసి, సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది.
యానిమేటెడ్ స్టిక్కర్స్: లేటెస్ట్‌గా యానిమేటెడ్ స్టిక్కర్స్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్స్‌కు చాటింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఫన్‌గా ఉండేందుకు యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉపయోగపడతాయి.
గ్రూప్ వీడియో కాలింగ్: ఇంతకుముందు నలుగురికి మాత్రమే పరిమితమైన గ్రూప్ వీడియో కాలింగ్ ఇప్పుడు ఎనిమిది మందికి అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి ఎనిమిందితో గ్రూప్ కాల్ చేసుకోవచ్చు.
డిసప్పియరింగ్ స్టేటస్: ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కు అందుబాటులో ఉన్న స్టేటస్ డిసప్పియరింగ్ ఫీచర్ ‘కాయ్ ఓఎస్’ యూజర్స్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది.