ప్రముఖ ఇన్ స్టాంట్ మెస్సేజింగ్ యాప్, మెటా కంపెనీ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్, ఏఐ, వీడియో క్లిప్స్ సెండ్ చేసుకునే ఆప్షన్ ను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. ఇంగ్లీష్ రాని వారు చాలామంది వాట్సాప్ లో ఇబ్బంది పడుతుంటారు. వారి కోసం వాట్సా్ప్ యాప్ సూపర్ ఫీచర్ తీసుకువచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.15.8 లో ఈ ఫీచర్ ను అందించింది. ఈ విషయాన్ని wabetainfo నివేదించింది. ఈ ఫీచర్ ను వివరించే స్క్రీన్ షాట్ లను కూడా తన అధికారిక X అకౌంట్ నుండి షేర్ చేసింది.
ఇక రెండవ ఫీచర్ ఫీచర్ విషయానికి వస్తే, వాట్సాప్ లో కొత్త బోటమ్ కాలింగ్ కోసం కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.12.14 తో కాలింగ్ స్క్రీన్ కోసం కొత్త ఇంటర్ ఫేజ్ ను పరిచయం చేసింది. ఇది బోటమ్ కాలింగ్ కు కొత్త సొబగులు దిద్దుతుంది. ఈ ఫీచర్ ను ఇప్పుడు అందరూ యూజర్లకు విరివిగా విస్తరిస్తునట్లు కూడా తెలుస్తోంది.
ఈ కొత్త అప్డేట్ లతో వాట్సాప్ కాలింగ్ లో కనిపించే స్క్రీన్ లో కనిపించే బటన్స్ మరింత పెద్దగా, బ్రైట్ గా కనిపిస్తాయని చెబుతోంది. ఈ స్క్రీన్ సెమీ ట్రాన్స్పరెంట్ బ్యాగ్రౌండ్ లో కనిపిస్తుందని కూడా ఈ రిపోర్టులో తెలిపింది. ఇక ఇటీవల వచ్చిన కొత్త ఫీచర్ విషయానికి వస్తే, వాట్సాప్ బీటా టెస్టర్స్ కోసం కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్ క్రిప్షన్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్లకు వచ్చిన వాయిస్ మెసేజ్ లను వారికి అనువైన లాంగ్వేజ్ లోకి తర్జుమా చేసుకుని వినే అవకాశం ఉంటుంది.
ఈ ఫీచర్స్ ముందుగా బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులో ఉంచిన వాట్సాప్, ఇప్పుడు కొందరు యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది.
ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్ లోనే ట్రాన్స్ లేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఏ భాష నుంచి అయినా మీకు కావాల్సిన భాషలోకి అనువాదం చేసుకోవచ్చు. ట్రాన్స్ లేట్ కోసం వేరే యాప్ లపై ఆధారపడాల్సిన అవసరం లేదు.