
విండోస్ OS (ఆపరేటింగ్ సిస్టమ్) మొబైల్స్ ఉపయోగిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఆ మొబైల్స్ లో ఇక పై ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పనిచేయదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ ఫోన్లకు డిసెంబర్‌లో సపోర్ట్‌ను నిలిపివేయనుంది. దీంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సాప్ తెలిపింది. ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ 2.3.7,IOS 7 అంత కన్నా తక్కువ వెర్షన్ OSలు ఉన్న డివైస్‌లలోనూ వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ చెబుతోంది. అయితే విండోస్ ఫోన్లు, డెస్క్‌టాప్‌ల కోసం త్వరలోనే యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం పేరుతో ఓ కొత్త వాట్సాప్ వెర్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.