
వాట్సాప్లో ఎమోజీలు వాడటం చాలా కామన్. బాధ, సంతోషం, ప్రేమ, కోపం, నవ్వు వంటి భావోద్వేగాల్ని వెల్లడించడానికి ఇవి సులభమైన విధానం. తాజాగా ఎమోజీల్లో వాట్సాప్ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దాదాపు 155 ఎమోజీలను కొత్త డిజైన్లతో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ 2.19.139 వెర్షన్ అప్డేట్లో కొత్త ఎమోజీలు అందుబాటులో ఉంటాయి. మొత్తం 357 ఎమోజీలను రీడిజైన్ చేయాలనుకున్న వాట్సాప్ గతంలో 21 ఎమోజీలను కొత్తగా రూపొందించగా, ఇప్పుడు 155 ఎమోజీల్ని మార్చింది. మిగతా వాటిలో కొన్ని ఎమోజీల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. అలాగే ‘వాట్సాప్ నైట్మోడ్’ ఫీచర్ ను కూడా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించింది.