వాట్సాప్ సరికొత్త ఫీచర్స్.. త్వరలో అందుబాటులోకి

వాట్సాప్ సరికొత్త ఫీచర్స్.. త్వరలో అందుబాటులోకి

తన వినియోగదారులని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో సర్ ప్రైజ్ చేసున్న వాట్సాప్..  మరో 5 కొత్త ఫీచర్లతో అలరించనుంది. ఆ ఫీచర్లను మొదట బీటా యూజర్లకు రిలీజ్ చేసి, వాటి పనితీరును పరిశీలించి.. ఆ తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేసి మిగతా యూజర్లకు అందించనుంది. ఆ ఫీచర్లు ఏమిటో? వాటి ఉపయోగాలెంటో తెలుసుకుందాం.

Frequently Forwarded:  ఈ మధ్య కాలంలో వాట్సాప్ యూజర్లు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య..  వాట్సాప్ లో వచ్చే ఫేక్ న్యూస్. ఏదీ నిజమో ఏదీ అబద్ధమో తెలుసులేక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇకపై అలాంటి మెసేజ్ లను సులభంగా గుర్తించేందుకు వాట్సాప్.. ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ అనే ఫీచర్ తీసుకొస్తోంది. ఒక మెసేజ్ ఎన్నిసార్లు ఫార్వర్డ్ అయిందో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక మెసేజ్ నాలుగు సార్ల కన్నా ఎక్కువ ఫార్వర్డ్ అయినట్టైతే దాన్ని ‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్’ మెసేజ్‌గా భావిస్తారు. ప్రస్తుతం ఇండియాలో ఒక మెసేజ్‌ను ఐదుగురికన్నా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయలేరు.

Hide Muted Status:  ఇప్పటి వరకు మన వాట్సాప్ లో ఎవరివైనా స్టాటస్ లు నచ్చకపోతే వాటిని మ్యూట్ చేసేవాళ్లం. అలా కాకుండా వారి స్టేటస్ మొత్తాన్నే హైడే చేసే ఫీచర్  హైడ్ మ్యూటెడ్ స్టాటస్. ఈ ఫీచర్ తో మనకు ఎవరి స్టేటస్ లు నచ్చట్లేదో వారి స్టేటస్ ను హైడ్ చేయొచ్చు.  ఆ తర్వాత మళ్లీ కావాలంటే షో అనే సెలక్ట్ చేసుకోవచ్చు.

Dark Mode: మిగతా యాప్స్ తో పోలిస్తే   వాట్సాప్ లో ఇప్పటి వరకు డార్క్ మోడ్ అనే ఆప్షన్ లేదు. తన యూజర్ల కోసం వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ను త్వరలో అందుబాటులోకి తేనుంది.

Share WhatsApp status: ఈ ఫీచర్ తో మీ వాట్సప్ స్టేటస్‌ను డైరెక్టుగా ఫేస్ బుక్ లోకి షేర్ చేయొచ్చు.  మీరు ప్రత్యేకంగా రెండు యాప్ లలో మీ సందేశాన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా.. స్టేటస్ లో పెట్టిన మెసెజ్ ను ఫేస్ బుక్ షేర్ చేసేందుకు ఈ షేర్ వాట్సాప్ స్టాటప్ ఉపయోగపడుతుంది.

WhatsApp Fingerprint Lock:  ఫింగర్ ప్రింట్ తో ఎలాగైత్ మన మొబైల్ ను అన్ లాక్ చేస్తామో.. అదే విధంగా వాట్సాప్ ను కూడా అన్ లాక్ చేయబోయే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కొత్తగా రాబోతోంది. అదే వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్. ఇప్పటి వరకు మనం లాక్ చేసిన మన వాట్సాప్ ను పాస్ వర్డ్ లేదా కీ ప్యాడ్ ప్యాటర్న్ తో ఓపెన్ చేసే వాళ్లం. అలాకాకుండా ఫింగర్ ప్రింట్ తో అన్ లాక్ చేయాలంటే ఈ ఫీచర్ తప్పని సరి. ఈ ఫీచర్ తో  సెక్యూరిటీ లాక్ ఏదైనా సరే మన ఫింగర్ ప్రింట్ తో ఈజీ గా ఓపేన్ చేసేయొచ్చు.