
వాట్సాప్ అనేది ఉచిత మెసేజింగ్,వీడియో కాలింగ్ యాప్. కాబట్టి మీరు టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు,డాక్యుమెంట్ల పంపవచ్చు. అలాగే గ్రూప్ చాట్‌లను సృష్టించవచ్చు, వాయిస్,వీడియో కాల్స్ చేయవచ్చు. ఇదంతా తెలిసిన విషయమే.. అయితే ఇంకా యూజర్లకు మెరుగైన సర్వీస్ అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందిస్తుంది. తాజాగా మరో కొత్త అప్డేట్ను తీసుకువస్తుంది. అదే స్టేటస్ లో మ్యూజిక్ జోడించడం.
ఇప్పటివరకు మనం ఫొటోలు మాత్రమే అప్డేట్ కు అవకాశం ఉంది. మ్యూజిక్, వీడియోలు యాడ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్ లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ అప్డేట్స్ అందించే వాట్సాప్..తాజాగా ఈ మ్యూజిక్ ఫీచర్ ను తీసుకొస్తుంది. అయితే వాట్సాప్ ఇప్పుడు ఫొటో, వీడియోకు సాంగ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు.
ఎలా మ్యూజిక్ చేయాలంటే..
ఈ కొత్త ఫీచర్ తో వాట్సాప్ యూజర్లు వారి స్టేటస్ అప్డేట్లలో నచ్చిన సాంగ్స్ ను చేర్చవచ్చు.ఇవి 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి. వాట్సాప్ మాతృసంస్థ అయిన Meta తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్ లో ని మ్యూజిక్ లైబ్రరీలో యూజర్లు ఎంచుకునేందుకు మిలియన్ల కొద్ది సాంగ్స్ ను అందిస్తుంది.
ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్‌లో యూజర్లు ఇప్పటికే షేర్ చేయగల టెక్స్ట్, ఫోటోలు, వీడియోలతో పాటు ఇంటిగ్రేట్ చేయనున్నారు. మరికొద్ది వారాల్లో ఇది ఈ ఫీచర్ ఇంటిగ్రేట్ చేయబడుతుందని వెర్జ్ రిపోర్టు చెబుతోంది.
ALSO READ | గూగుల్ పిక్సెల్9a స్మార్ట్ఫోన్ వచ్చేస్తుందోచ్.. ధర,ఫీచర్లు,స్పెసిఫికేషన్లు అదుర్స్
స్టేటస్ అప్డేట్ చేయడానికి ఆ బటన్ నొక్కినప్పుడు స్క్రీన్ పైభాగంలో ఓ మ్యూజిక్ నోట్ ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా పోస్ట్ కు మ్యూజిక్ యాడింగ్ చేయొచ్చు. ఫొటోతో పాటు 15 సెకన్లు, వీడియోకోసం 60 సెకన్ల నిడివి గల మ్యూజిక్ లేదా సాంగ్ ను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ మ్యూజక్ ఫీచర్ లా పనిచేస్తుంది. వాట్సాప్ యూజర్లు తమకు నచ్చిన సాంగ్స్, లేదా మ్యూజిక్ ను జోడించడం ద్వారా స్టేటస్ అప్డేట్ కు మరింత ఎంటర్ టైన్ మెంట్ చేర్చవచ్చు.
కొత్త మ్యూజిక్ ఫీచర్ లో ప్రత్యేకత ఏంటంటే యూజర్లు మ్యూజిక్ ట్రాక్‌లోని నిర్దిష్ట భాగాన్ని ఎంచుకుని షేర్ చేసుకోగలగడం. అది కోరస్ కావచ్చు. అర్థవంతమైన లిరిక్స్ కావచ్చు. ఆకట్టుకునే సౌండ్ బైట్ కావచ్చు. ఇలా ఏదైనా నచ్చిన ట్రాక్ లోని కొంత భాగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
వాట్సా్ప్ లో మీ మెసేజ్‌లు ,కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మీరు ,మీరు మాట్లాడుతున్న వ్యక్తి మాత్రమే వాటిని చూడగలరు. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇది స్నేహితులు,కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి, అలాగే బిజినెస్ ,ఇతర సంస్థలతో కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ బెస్ట్ వే అవుతుంది.