వాట్సాప్ షాక్ : ఇండియాలో 99 లక్షల అకౌంట్స్ డిలీట్

వాట్సాప్ షాక్ : ఇండియాలో 99 లక్షల అకౌంట్స్ డిలీట్

జనవరి 1 నుంచి జనవరి 30  మధ్య భారత్ లో 99 లక్షలకుపైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసింది.వాట్సాప్ యాప్ షాక్ ఇచ్చింది. ఇండియాలో 99 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ సృష్టిస్తున్నట్లు నిర్థారించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ ప్రకటించింది. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి 30వ తేదీ మధ్య భారతదేశంలో 99 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు.. డిలీట్ చేసినట్లు ప్రకటించింది. 9 వేల 474 కంప్లయింట్ వచ్చాయని.. వాటి ఆధారంగా విచారణ చేసి.. ఆయా అకౌంట్లను పరిశీలించి డిలీట్ చేయటం జరిగినట్లు స్పష్టం చేసిన వాట్సాప్.. నిషేధం తర్వాత వచ్చిన అప్పీల్స్ ను కూడా పరిశీలించి.. ఈ 99 లక్షల అకౌంట్లలో.. 111 ఖాతాలను మళ్లీ యాక్టివేట్ చేయటం జరిగినట్లు వెల్లడించింది.

2025 జనవరిలో99 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసినట్లు వాట్సప్ తన రిపోర్ట్ లో వెల్లడిచింది. వేరే కస్టమర్స్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందే 13 లక్షల 27 వేల అకౌంట్లను ముందస్తుగా బ్యాన్ చేసింది వాట్సప్.  ఇక జనవరిలో  లో వినియోగదారుల నుంచి 9 వేల 474 ఫిర్యాదులు అందాయి. వాటిలో 239 ఖాతాలను పూర్తిగా నిషేధించినట్లుగా వాట్సాప్ ప్రకటించింది. వీటిలో ఇమెయిల్‌లు, పోస్టల్ మెయిల్ ద్వారా ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సమాచారం అందినట్లుగా సంస్థ వెల్లడించింది.

ALSO READ | అన్ లిమిటెడ్ డేటా ఆఫర్‌తో..వొడాఫోన్ ఐడియా 5G సర్వీసెస్ ప్రారంభం..

ఇన్ఫర్మేషన్ టెక్నాలీజీ రూల్స్ 2021లోని (1)(d), 3A(7) కింద కొన్ని విధానాలు ఉల్లంఘించినందుకు  అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లు తెలిపింది.  నిబంధనలను ఉల్లంఘించే వాట్సప్ అకౌంట్స్ ను గుర్తించి చర్య తీసుకోవడానికి వాట్సప్ ఆటోమేటెడ్  సిస్టమ్, యూజర్ ఫీడ్ బ్యాక్ ఉపయోగిస్తుంది.  స్పామ్ ,తప్పుడు ఇన్ఫర్మేషన్, మోసపూరిత కార్యకాలాపాలు జరిపిన అకౌంట్స్ ను వాట్సప్ బ్యాన్ చేస్తుంది. 

 చట్ట ఉల్లంఘనలను వాట్సప్ ఎలా గుర్తిస్తుందటే..  మల్టీ లెవల్ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. దీని కోసం మూడు వ్యవస్థలు మూడు కీలక దశలలో పనిచేస్తాయని తెలిపింది. మొదటి దశలో అనుమానస్పద అకౌంట్స్ ఫ్లాగ్ చేసి. సైన్ అప్ టైంలో బ్లాక్ అవుతాయి. రెండో దశలో మెసేజ్ చేసేటపుడు వాట్సప్ ఆటోమెటెడ్ సిస్టమ్ లు బల్క్ మెసేజింగ్ లేదా స్పామ్ వంటి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తాయి. మూడో దశలో కస్టమర్ ఫిర్యాదు చేస్తే అకౌంట్స్ బ్యాన్ చేస్తాయి. వాట్సప్ అకౌంట్ ను దుర్వినియోగం చేయడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినపుడు బాధిత వ్యక్తుల ఖాతాలను కూడా వాట్సప్ గమనిస్తుంది.  దర్యాప్తు చేసిన తర్వాత చర్యలు తీసుకుంటుంది.