ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్స్..

ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్స్..

ఐఫోన్​ యూజర్ల కోసం వాట్సాప్​ కొత్త అప్​డేట్ తీసుకొచ్చింది. అదేంటంటే.. ఐఒఎస్​18.2 వెర్షన్ వాడే యూజర్లు ఇకనుంచి డిఫాల్ట్ కాల్స్, మెసేజింగ్ యాప్స్​ ఉపయోగించొచ్చు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందుకోసం ఐఫోన్​ని ఐఒఎస్​18.2 లేదా అంతకంటే బెటర్​ వెర్షన్​కి అప్​డేట్ చేయాలి. ఆ తర్వాత డిఫాల్ట్​ కాల్స్ లేదా మెసేజింగ్​ సర్వీస్​లను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగా సెట్టింగ్స్​కి వెళ్లి అక్కడ యాప్స్​ ఆప్షన్ క్లిక్ చేసి డిఫాల్ట్​ కాల్స్, మెసేజింగ్ యాప్స్​ని ఎంచుకో వాలి. 

డిఫాల్ట్ యాప్​ సెట్ చేశాక కాంటాక్ట్స్​లో ఏదైనా నెంబర్​ లేదా వేరే యాప్​లోని ఏదైనా ఫోన్​ నెంబర్​ని ఎంచుకోవాలి. అప్పుడు అది యాపిల్ ఫోన్ లేదా మెసేజ్ యాప్​లకు బదులు వాట్సాప్​కి మళ్లిస్తుంది. కమ్యూనికేషన్ కోసం ఒక్క యాప్​ మాత్రమే వాడాలనుకునేవాళ్లకు ఇది పర్ఫెక్ట్.   

గూగుల్​.. టైమ్​ ట్రావెల్! 

టైమ్​ ట్రావెల్ చేసి వెనక్కి వెళ్లాలి.. అప్పటి పరిస్థితులు చూడాలి.. నాటి సంగతుల్ని తెలుసుకోవాలనే ఫాంటసీ ఆలోచనలు ఏదో ఒకటైంలో అందరికీ వస్తుంటాయి. కానీ, అది నిజ జీవితంలో జరగదు కదా! అందుకే టెక్నాలజీని ఉపయోగించి ఆనాటి ఆనవాళ్లను కళ్లకు కట్టినట్టు చూపించాలని ఫిక్స్​ అయింది గూగుల్. దాంతో గూగుల్ ఎర్త్​ కోసం గూగుల్​ మ్యాప్స్ మరో ఇంట్రెస్టింగ్​ ఫీచర్​ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్​ ద్వారా టైమ్​ ట్రావెల్ చేయొచ్చట!

 ఎలాగంటే.. ఫోన్​ లేదా కంప్యూటర్​లో ఒకప్పుడు ప్రదేశాలు ఎలా ఉండేవో తెలుసుకోవచ్చు. తద్వారా దాదాపు 30–40 ఏండ్ల వెనక్కి ప్రయాణించొచ్చన్న మాట. గూగుల్ టైమ్​ ట్రావెల్ ఫీచర్​ని ఎలా వాడాలంటే... గూగుల్ మ్యాప్స్​ లేదా గూగుల్ ఎర్త్​కి వెళ్లి, మీరు చూడాలనుకుంటున్న లొకేషన్ సెర్చ్ చేయాలి. అక్కడి నుంచి లేయర్స్ ఆప్షన్​ నావిగేట్ చేసి, టైమ్ లాప్స్​ను ఎంచుకుంటే వ్యూ కనిపిస్తుంది.