వాట్సాప్‌లో ఐఓఎస్ యూజర్ల కోసం కొత్తగా కాల్ డయలర్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నెంబర్ సేవ్ చేయకుండా నేరుగా కాల్ చేయొచ్చు. అదే కాకుండా ఈ ఫీచర్ ఎంటర్ చేసిన నెంబర్ వాట్సాప్‌లో రిజిస్టర్ ఉందో? లేదో కూడా చూపిస్తుంది. ఆ నెంబర్ బిజినెస్‌కి సంబంధించింది అయితే పక్కనే వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది.
ఈ ఫీచర్‌ని ఎలా వాడాలంటే.. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, కాల్స్ ట్యాబ్‌కు వెళ్లాలి. అక్కడ కాల్ ఎ నెంబర్ కొత్త ఆప్షన్ లేదా దానికి సంబంధించిన ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే డయలర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. డయలర్‌లో కాల్ చేయాలనుకుంటున్న నెంబర్‌ను ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేయగానే, వాట్సాప్‌లో ఉందో లేదో ఆటోమెటిక్‌గా చెక్ చేసి చూపిస్తుంది. ఆపై కాల్ డయల్ చేయొచ్చు. కావాలంటే ఆ నెంబర్‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో యాడ్ చేయొచ్చు.