భారత యూజర్లకు వాట్సాప్ బిగ్ షాకిచ్చింది. 2023 సెప్టెంబర్ ఒక్క నెలలోనే 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ ను బ్యాన్ చేసింది. కొత్త ఐటీ రూల్స్ ను అనుసరించి ఒక నెల వ్యవధిలో, భారత్ లో దాదాపు 71,11,000 అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లుగా వెల్లడించింది. అయితే ఇందులో 25,71,000 అకౌంట్లపై యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. గత నెల ఆగస్టులో బ్యాన్ చేసిన అకౌంట్లతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో మూడు లక్షలు తక్కువేనని చెప్పాలి.
వినయోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధిస్తోంది. వాట్సాప్‌ని దుర్వినియోగం చేస్తున్న క్రమంలో యూజర్ సేఫ్టీ దృష్ట్యా, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా సదరు అకౌంట్లపై కంపెనీ బ్యాన్ విధిస్తోంది. కాగా ఆగస్టు నెలలో మొత్తం 74 లక్షల ఖాతాలను బ్యాన్ చేయగా వీటిలో 35 లక్షల అకౌంట్లపై యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా చర్యలు తీసుకున్నారు.
ALSO READ :- ఏం మనుషులయ్యా : యంగ్ డైరెక్టర్ కు యాక్సిడెంట్.. అర గంట వరకు పట్టించుకున్నోళ్లే లేరు