వాట్సాప్ చాట్లలో ఫొటోలు, వీడియోల కోసం కెమెరా ఎఫెక్ట్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు 30 డిఫరెంట్ ఫిల్టర్స్, బ్యాక్గ్రౌండ్లు, విజువల్ ఎఫెక్ట్స్ నుంచి ఎంచుకోవచ్చు. వాటిని పంపే ముందు మెరుగుపరచొచ్చు. అంతేకాదు... మరో కొత్త ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అదే.. సెల్ఫీ స్టికర్స్. ఇప్పుడు చాట్లలో షేర్ చేయడానికి సెల్ఫీలను స్టిక్కర్లుగా మార్చొచ్చు. ఎలాగంటే.. ముందుగా క్రియేట్ స్టిక్కర్స్ ఐకాన్ ట్యాప్ చేయాలి. సెల్ఫీని కెమెరాతో క్యాప్చర్ చేయాలి. దాంతో స్టిక్కర్‌తో పాటు ఉన్న సెల్ఫీ వస్తుంది. ఇందుకోసం కస్టమైజ్డ్ స్టిక్కర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది.
స్టిక్కర్ ప్యాక్‌లు...
ఒక ఫ్రెండ్ కోసం స్టిక్కర్ ప్యాక్ సెలక్ట్ చేసుకుని ఇప్పుడు దాన్ని డైరెక్ట్‌గా చాట్లలో షేర్ చేసుకోవచ్చు. స్టిక్కర్ యూజర్లకు రియాక్షన్లకు వాడే ఆప్షన్లు కూడా ఉంటాయి. యూజర్లు ఇప్పుడు రియాక్షన్లకు మెసేజ్‌పై రెండుసార్లు ట్యాప్ చేయొచ్చు. యూజర్లు ఎక్కువగా వాడే ఎమోజీల కోసం స్క్రోలింగ్ పాప్ అవుట్ మెను కూడా తీసుకురానుంది. దీంతో రెగ్యులర్‌గా ఉపయోగించే రియాక్షన్లను వేగంగా వాడొచ్చు. ఎమోజీ లైబ్రరీ ఇప్పుడు రియాక్షన్ బార్ ‘+’ ఐకాన్ ద్వారా యాక్సెస్ చేసేలా ఉంటుంది.