మేసేజింగ్ యాప్ WhatsApp లో మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్తో చాట్‌లలో వీడియో మేసేజ్ త్వరగా రికార్డ్, షేర్ చేయొచ్చు. ఎటువంటి ఆటంకం లేకుండా మధుర క్షణాలను పంచుకునేందుకు ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యేందుకు ఈ కొత్త ఫీచర్ రూపొందించబడింది.
Meta వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ WhatsApp కోసం కొత్త ఫీచర్‌ను గురువారం ప్రకటించారు. ఇది వినియోగదారులు చాట్‌లలో వీడియో సందేశాలను తక్షణమే రికార్డ్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది. స్నేహితులు , కుటుంబ సభ్యులతో సరదాగా, సౌకర్యవంతంగా వీడియో చాటింగ్ మరింత సులభతరం చేసేందుకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు.
వీడియో మెసేజ్ ఫీచర్ త్వరిత వాయిస్ మెసేజ్‌ని పంపే విధంగా పనిచేస్తుంది. వీడియో సందేశాన్ని రికార్డ్ చేయడానికి వినియోగదారులు ఒక్కసారి నొక్కి పట్టడంతో వీడియో మోడ్‌కి మారవచ్చు. అదనంగా వీడియోను హ్యాండ్స్-ఫ్రీగా లాక్ చేసి రికార్డ్ చేయడానికి పైకి స్వైప్ చేయవచ్చు. ప్రతి వీడియో సందేశం 60 సెకన్ల నిడివితో షేర్ చేయొచ్చు. యూజర్లు ప్రత్యక్షంగా వారు తెలియజేయాలనుకుంటున్న వాటితో ప్రతిస్పందించేందుకు వీలు కల్పిస్తుంది.
AsloRead: రేవంత్ కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?: హైకోర్టు
వీడియో మేసేజ్ ను ఎలా పంపించాలి
వీడియో మేసేజ్ కూడా వాయిస్ మేసేజ్ లా పంపించడం వంటిదే. వీడియో మోడ్ నొక్కి పట్టి వీడియోను రికార్డ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. అదనంగా రికార్డింగ్ పైకి స్వైప్ చేసి లాక్ చేసే అవకాశం ఉంది. వీడియోను రిసీవ్ చేసుకున్నవారు వీడియోను తెరిచినప్పుడు అది మ్యూట్ లో ప్లే అవుతుంది. వీడియోపై నొక్కితో సౌండ్ కూడా వస్తుంది.
ఈ కొత్త చేరికతో WhatsApp దాని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడం కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల వినియోగదారులకు ఆటంకంలేని సేవలంచాలనే లక్ష్యంతో మెటా పనిచేస్తుందని జుకర్ బర్గ్ తెలిపారు. విజువల్ కమ్యూనికేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్ తో ఈ ఫీచర్ అందిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌లలో ఒకటిగా WhatsApp స్థానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.