వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
  • అందుబాటులోకి ‘ఇన్వైట్​ సిస్టం ’
  • గ్రూపులో యాడ్ చేయాలంటే యూజర్ పర్మిషన్ మస్ట్

న్యూఢిల్లీ : ఏదైనా వాట్సాప్ గ్రూపులోఉన్నారా ? ఆ గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చారు? మీ పర్మిష న్ తీసుకున్నా రా? లేదు కదా! మీ ఇష్టా ఇష్టాలను తెలుసుకోకుండాఎవరో ఓ వ్యక్తి యాడ్ చేసి ఉంటారు కదా! పోనీ మీరే చెప్పి చేయించుకున్నా .. డైరెక్ట్​గా యాడ్ అయి ఉంటారు కదా! కానీ, ఇకపై అలా కుదరదు. వాటన్నింటికీ చెల్లు . అబద్ధపు వార్తలను అరికట్టే చర్యల్లో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చిం ది. ఇకపై, ఎవరుపడితే వాళ్లు ఎవరిని పడితే వాళ్లను గ్రూపుల్లో యాడ్ చేయడం కుదరదు. ఆ గ్రూపులో ఓ వ్యక్తి ని యాడ్ చేయాలంటే సదరు వ్యక్తి పర్మిషన్ తప్పనిసరిప్పుడు. ఇప్పటికే ఒకేసారి ఫార్వర్డ్ ఆప్షన్ ను ఐదుగురికే పరిమితం చేసిన వాట్సాప్ .. తాజాగా ‘ఇన్వైట్ సిస్టం ’ అనే సరికొత్త ఫీచర్ ను ప్రైవసీ సెట్టింగ్స్​లో చేర్చింది. బుధవారం ఆ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించిం ది. ‘‘ప్రైవసీ సెట్టింగ్ స్ లోఇన్వైట్ సిస్టం అనే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చాం . ఏగ్రూపులో చేరాలో ఇప్పుడు మీరే డిసైడ్ చేయొచ్చు”అని పేర్కొంది. ఓ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.

ఎలా పనిచేస్తుంది?

గ్రూప్ అడ్మిన్ ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే ముందు మెసేజ్ రూపంలో ఇన్వైట్ రిక్వెస్ట్​ పంపాలి. దానికి యూజర్ పర్మిషన్ ఇవ్వాలి. గ్రూపులో చేరాలా వద్దా అన్నది యూజర్ కంట్రోల్ లోనే ఉంటుంది. రిక్వెస్ట్​ను ఆమోదించేందుకు మూడు రోజుల టైం ఉంటుంది. తర్వాత అది ఎక్స్ పైర్‌ అవుతుంది.

ప్రైవసీ ఎలా పెట్టుకోవాలి?

  • ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగావాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
  • అకౌం ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • అందులో ప్రైవసీలోకి వెళ్లాలి
  • అందులో గ్రూప్ ఆప్షన్ ను ఎంచుకోవాలి
  • అక్కడ ‘నోబడీ/ఎవరికీ కాదు’, ‘మై కాం టాక్స్ట్ ’,‘ఎవెరీవన్ ’ అనే మరో మూడు ఆప్షన్లుంటాయి
  • గ్రూపులో చేరేందుకు మీ పర్మిషన్ తప్పని సరి అనుకుంటే ‘నోబడీ’ ఆప్షన్ ను పెట్టు కోవాలి.