వాట్సాప్ లో AI ప్యూచర్.. ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది..!

యూజర్ ఎగేజ్మెంట్ పెంచడానికి వాట్సాప్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి అనుగుణంగా వాట్సాప్​లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది దాని మాతృసంస్థ మెటా. ఇప్పటికే యూజర్లు ఏఐతో స్వయంగా స్టిక్కర్లను, ఇమేజ్​లను క్రియేట్​ చేసేకునే విధంగా సరికొత్త ఫీచర్​పై ఆ సంస్థ పని చేస్తోంది. ఏఐతో పని చేస్తూ వాటప్స్ న్యూ చాట్​బాట్, న్యూ సెర్చ్ బటన్ ​తీసుకువస్తున్నట్లు వాటస్ప్ సంస్థ గత కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది.

చాట్ జిపీటి తరహాలో కస్టమర్ సపోర్ట్ ను రూపొందిస్తోంది. అంటే వాట్సాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు తలెత్తితే ఏఐ ద్వారా పరిష్కరించే విధంగా సరికొత్త ఫీచర్స్ తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.  దీంతో పాటు ఈ  అప్ డేట్ లో వాట్సాప్ వచ్చే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

–  ఇందులో భాగంగానే వాట్సాప్ ఛానల్స్ లోని అప్డేట్స్ ను నేరుగా వాట్సాప్ స్టేటప్ పెట్టుకునే అవకాశం ఉంది.
– కొన్ని ఫేవరేట్ కాంటాక్ట్ నెంబర్స్ ఎంచుకొని షాట్ కట్స్ ఉపయోగించి వారికి కాల్ ట్యాబ్ నుంచే కాల్ చేసే సౌకర్యాన్ని వాట్సాప్ కొత్త ఫీచర్ లో కల్పించనుంది.
ఈ ఫీచర్స్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో తీసుకురానుంది.