టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి

టెక్నాలజీ : వాట్సాప్ లో కొత్త ఫీచర్ .. ఒకసారి ట్రై చేయండి

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అప్​డేట్ చేస్తూనే ఉంటుంది. అది కూడా చాలా ఫాస్ట్​గా. ఇదే వరుసలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్​ తెచ్చింది వాట్సాప్​. అదే... డిఫాల్ట్​ చాట్ థీమ్ (Default Chat Theme).

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్​ విడుదల చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో (WABetaInfo) చెప్పింది. వాట్సాప్​లో రానున్న రోజుల్లో వచ్చే కొత్త అప్​డేట్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వాబీటాఇన్ఫో ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ కొత్త అప్డేట్​ను స్క్రీన్ షాట్​తో పాటు షేర్ చేసింది. దాని సారాంశం త్వరలో వాట్సాప్ కొత్త డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్​ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తెస్తోంది. నిజానికి, ఈ డీఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్ ఇప్పటికే బీటా టెస్టర్స్ కోసం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.2012 అప్డేట్​ను గూగుల్ ప్లే స్టోర్​లో ఉంచింది. ఈ ఫీచర్​తో చాలా రకాలైన స్టయిల్స్​లో నచ్చిన థీమ్​ను ఎంచుకునే అవకాశం ఉంది. 

ఇందులో మల్టీ కలర్, వైడ్ రేంజ్ ఆప్షన్స్​ కూడా యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా థీమ్ బ్రైట్​నెస్ కూడా సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త మల్టీ కలర్ చాట్ థీమ్​ను సెలక్ట్ చేసుకున్న యూజర్లకు వాల్ పేపర్, చాట్ బబుల్ కలర్ కూడా ఆటోమేటిక్​గా మారిపోతుంది. అంటే వాల్ పేపర్​ను బట్టి చాట్ బబుల్ కలర్ అడ్జస్ట్ అవుతుంది. అంతేకాదు, యాప్ సెట్టింగ్ ద్వారా యూజర్లు థీమ్ కస్టమైజేషన్ ఆప్షన్​ వాడి చాట్ థీమ్​ను యూజర్​కు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.