వాట్సాప్ వినియోగదారులకోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మార్పులను అప్డేట్ చేస్తూనే ఉంది.వాట్సాప్లో ఇంతకాలం మనకు బ్లూ కలర్, ఇతర రంగులు కనిపించాయి. అయితే తాజా అప్డేట్గా వాట్సాప్ పచ్చ రంగులోకి మారింది. ప్రస్తుతం కొందరు వినియోగదారులకు మాత్రమే ఇది అప్డేట్లతో మారిపోయిం ది. తర్వాలో వాట్సాప్ వినియోగదారులందరికి ఆ ఆకుపచ్చ ఇంటర్ఫేస్ వచ్చేయనుంది.
ఏం మార్పులు జరిగాయి ..
వాట్సాప్లో ఎన్ని చాట్ అప్డేట్స్ వచ్చాయనేదానికి సూచికగా నంబర్లు బ్లూ రంగులో ఉండేవి.. ఇప్పుడీ నంబర్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. చాట్స్ ఐకాన్ వెనక స్వల్పంగా ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది.
గతంలో వాట్సాప్లో స్టేటస్ అప్డేట్స్ ఐకాన్ నీలిరంగులో ఉండేది. ఇప్పుడు దాని నీలిరంగును తొలగించి గ్రే కలర్ లోకి మార్చారు. అప్ డేట్స్ ఏమైనా ఉంటే దానిపై ఆకుపచ్చ రంగులో డాట్ చూపించేలా మార్చారు.
వాట్సాప్లో షేర్ చేస్తున్న లింక్ లు కూడా ఇంతకు ముందు నీలిరంగులో హైలైట్ గా కనిపించేవి. ఇప్పుడవి కూడా ఆకుపచ్చ రంగులోకి మారాయి. సాధారణంగా వాట్సాప్ లోగో మొదటి నుంచి ఆకుపచ్చ రంగులోనే ఉంది. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్లోని అన్ని ఆప్షన్లను కూడా ఆకుపచ్చ రంగులోకి మార్చేస్తున్నారు.
ఎందుకీ మార్పు
వాట్సాప్ వినియోగంలో కొత్తదనం,ఆధునికత అందించడంలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్టు వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ప్రకటించింది. ఆకుపచ్చ రంగులో కళ్లపై ఒత్తిడి తక్కువిగా ఉంటుందని తెలిపింది.ఈ మార్పులు ఆప్షనల్ కాదట. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు అందరికీ ఇదే గ్రీన్ ఇంటర్ఫేస్ ఉంటుందని.. అప్డేట్ల ద్వారా ఈ మార్పు జరుగుతుందని మెటా సంస్థ చెపుతోంది.
Also Read:చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!
అయితే ఈ మార్పుపై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా అన్ని ఆప్షన్లను ఆకుపచ్చ రంగులోకి మార్చడాన్ని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు మాత్రమే సింగిల్ కలర్ థీమ్ చాలా బాగుందని అంటున్నారు.