సూపరో సూపర్: వాట్సాప్లో కొత్త ఫీచర్.. AI తో ఫొటోలు ఎడిటింగ్

సూపరో సూపర్: వాట్సాప్లో కొత్త ఫీచర్.. AI తో ఫొటోలు ఎడిటింగ్

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వినియోగదారుల సౌలభ్యం కొరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను అందిస్తూనే ఉంది. సెక్యూరిటీ ఫీచర్లతో పాటు అధునాతన టెక్నాలజికి సంబంధించిన ఫీచర్లను కూడా అందిస్తోంది. ఫొటో ఎడిటింగ్ కోసం చూసేవారికి వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను అందించబోతోంది. ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉంది ఈ ఫీచర్. పూర్తివివరాలు తెలుసుకుందాం రండి.. 

మెటాలో భాగమైన వాట్సాప్.. ఏఐ ఫీచర్లపైన దృష్టి సారించింది. త్వరలో ఫొటోలను ఎడిటింగ్ చేసేందుకు ఈ మేసేజింగ్ యాప్.. AIపవర్డ్ టూల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది అభివృద్ధి దశలో ఉంది. బహుశా ఈ కొత్త ఫీచర్ మనకు కొన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

వాట్సాల్ లో ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఫొటోను స్టైల్, బ్యాక్ గ్రౌండ్ చేంజ్ ద్వారా రకరకాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. వాట్సాప్ లో ఇమేజ్ ని ఓపెన్ చేసిన గ్రీన్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ AI ఎడిట్  ఆప్షన్ ద్వారా బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు.. స్టైల్ మార్చుకోవచ్చు.. ఇమేజ్ ఎక్స్ పాండ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇమేజ్ మోడ్స్ ఛేంజింగ్ పై స్పష్టత లేదు. 

Webetainfo  చెపుతున్నదాన్నిబట్టి.. AI పవర్డ్ టూల్ ఆండ్రాయిడ్ బీటావెర్షన్ 2.24.7.13లో  టెస్టింగ్ దశలో ఉంది. ఇది కొన్ని వారాల్లో అందరికి ఈ ఫీచర్ అందుబాటులో రానుంది.