భారతదేశపు అతిపెద్ద బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ వాట్సాప్‌లోనూ సేవల్ని ప్రారంభించింది. దీనివల్ల పాలసీదారులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ పేర్కొన్నారు. ఈ ఆలోచనతో పాలసీ దారులు సులభంగా ఎల్‌ఐసీ సేవలు పొందొచ్చు. అందుకోసం ఒక ఫోన్ నెంబర్‌ని కూడా లాంచ్ చేసింది ఎల్‌ఐసీ. ఆ నెంబర్‌తో కస్టమర్లకు 24/7 అందుబాటులో ఉండనుంది.
8976862090 అనే నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పంపిస్తేచాలు, ఎల్‌ఐసీకి సంబంధించిన 10 రకాల సేవలు ఫోన్‌లోనే పొందొచ్చు. దీనిద్వారా ప్రీమియం బకాయి, బోనస్ ఇన్ఫర్మేషన్, పాలసీ స్టేటస్, పాలసీ లోన్ గురించిన వివరాలు, లోన్ తిరిగి చెల్లింపు, లోన్ వడ్డీ, పేమెంట్ సర్టిఫికెట్, యులిప్ యూనిట్ల స్టేట్మెంట్స్‌ని వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఎల్‌ఐసీ సేవల లింక్‌లు, ఆప్ట్ ఇన్, ఆప్ట్ ఔట్ సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు పొందడానికి ఎల్‌ఐసీలో నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్‌ని వాడాలి.