వాట్సాప్ లో ఇప్పటి వరకు మెసేజ్ లు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు. అయితే, మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ అయిన ‘WhatsApp Scheduler’, ‘Do It Later’, SKEDit’.. లాంటి యాప్స్ వాడాలి. ఈ యాప్స్ బేసిక్ వెర్షన్ మాత్రమే పని చేస్తుంది. అదే ఫొటోలు, వీడియోలు పంపించాలంటే ప్రీమియం వెర్షన్ కొనాలి. ఈ నాలుగు స్టెప్స్‌తో షెడ్యూల్ చేయడం ఈజీ.
స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి
‘WhatsApp scheduler’ యాప్
లేదా వెబ్ సైట్ నుంచి ‘WhatsApp
scheduler.apk’ ఫైల్ డౌన్‌లోడ్ చేయాలి.
స్టెప్ 2: ‘WhatsApp scheduler’
యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక యాప్ బాటమ్
రైట్‌లో ఉన్న ‘+’ ఐకాన్ నొక్కాలి.
స్టెప్ 3: వాట్సాప్ గ్రూప్ లేదా పర్టికులర్
పర్సన్ కాంటా క్ట్ ఓపెన్ చేసి టైం, డేట్ సెట్
చేయాలి.
స్టెప్ 4: ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకొని..
మెసేజ్ టైప్ చేయాలి. తర్వాత షెడ్యూల్
చేయడానికి టాప్- రైట్ కార్నెర్‌లో ఉన్న
‘Create’ బట్టన్ నొక్కితే చాలు.