WhatsApp: వాట్సాప్ వాడుతున్నారా.. పండగ చేస్కోండి.. ఇది ఎంత గుడ్ న్యూస్ అంటే..

WhatsApp: వాట్సాప్ వాడుతున్నారా.. పండగ చేస్కోండి.. ఇది ఎంత గుడ్ న్యూస్ అంటే..

మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్పై కసరత్తు చేస్తోంది. టెక్నాలజీకి తగినట్టుగా ఎప్పటికప్పుడు యాప్ అప్డేట్ చేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తోన్న వాట్సాప్ తాజాగా ఫైల్స్ షేరింగ్ సర్వీస్పై దృష్టి సారించింది. ఇంటర్నెట్ అవసరమే లేకుండా యూజర్లు ఫైల్స్ను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్కు వాట్సాప్ను ఉపయోగించి పంపించుకునేలా 'Nearby Share' ఫీచర్ తరహాలో సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ యోచిస్తోంది. యాపిల్ యూజర్లకు అందుబాటులో ఉన్న  Airdrop తరహా ఫీచర్ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు ఇంటర్నెట్ అవసరమే లేకుండా ఆఫ్లైన్లో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే.. వాట్సాప్ తీసుకురాబోతున్న ఆఫ్లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ సైజ్ ఉన్న ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ end-to-end encrypted connection విధానంలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే జీబీలకు జీబీల సైజ్ ఉన్న ఫైల్స్ను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్లోకి సెకన్ల వ్యవధిలో పంపించుకునే అవకాశం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు ఉంటుంది. యాపిల్ యూజర్లకు కూడా వాట్సాప్ ఈ ఫీచర్ను అందుబాటులో ఉంచనుంది.

ALSO READ | Jio: మీది జియోనా..? రీఛార్జ్ డేట్ దగ్గర పడిందా..? ఇంట్లో పెళ్లి తర్వాత అంబానీ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..!

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు వాట్సాప్ తెలిపింది. అందుబాటులోకి తీసుకురావడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందని పేర్కొంది. WhatsApp Nearby Share క్యూఆర్ కోడ్తో కూడా ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్కు కనెక్ట్ అవుతుందట. WhatsApp Android beta (v2.24.9.22) వెర్షన్లో ఈ ఫీచర్ టెస్టింగ్ జరుగుతోంది. ఈ ఫీచర్ వినియోగించినపుడు డివైజెస్ లిస్ట్ కనిపిస్తుంది. ఎవరికి పంపాలో వాళ్ల డివైజ్కు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.