ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్లు తెలుసా!

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్లు తెలుసా!

యాపిల్ తో పోలిస్తే ఎక్కువమంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వాడుతారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎన్నో కస్టమైజ్డ్ ఫీచర్లుంటాయి. అయితే చాలా మందికి వాటి గురించి తెలియక బేసిక్ ఫీచర్లనే వాడుతుంటారు. కానీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే వాటిల్లో ఇంట్రస్టింగ్ ఫీచర్లను ఉపయోగించడం మొదలుపెడితే మొబైల్ ఫోన్ వాడటం చాలా ఈజీ అవుతుంది. అలాంటి కొన్ని ఆసక్తికర ఫీచర్లు కొన్నీ….

యాప్స్ సైడ్ బై సైడ్
ఫోన్ లో ఓవర్ వ్యూ బటన్ (స్క్వేర్ షేప్ బటన్) ప్రెస్ చేయడం ద్వారా ఇంతకుముందు వాడిన యాప్స్​ ఒకదాని పక్కన మరోటి లేదా ఒకదానిపైన మరోటి కనిపిస్తాయి కదా. స్క్రీన్ పై డిస్ ప్లే అవుతున్న వాటిలోంచి కావాల్సిన యాప్ ను సెలెక్ట్​ చేసుకునేం దుకు స్క్రీన్ పైన టచ్ చేయక్కర్లేదు. అదే బటన్ పై డబుల్ ట్యాప్ చేస్తే ఒక దాని తర్వాత మరో యాప్ ఓపెన్ అవుతుంది.

స్క్రీన్ పిన్నింగ్
ఫ్రెండ్స్ కో, ఇంట్లో పిల్లలకో ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సమయంలో ఏదైనా ప్రైవేట్​ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇతర యాప్స్​వాడేస్తారనో, లేదా సోషల్ మీడియాలో అనవసరమైంది పోస్ట్​ చేస్తారనో భయం ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ‘స్క్రీన్ పిన్నిం గ్’ ఫీచర్ ను వాడుకోవాలి. దీనివల్ల ఏదైనా ఒకటి లేదా కావాల్సిన యాప్ ను మాత్రమే ఇతరులు యాక్సెస్ చేయగలుగుతారు. మిగతా యాప్స్​ ఓపెన్ కావు. వీటిని ఓపెన్ చేయాలనుకుంటే ప్రత్యేక పిన్ లేదా పాస్ వర్డ్ అడుగుతుంది. దీన్నే ‘స్క్రీన్ పిన్నింగ్’ అంటారు. సెట్టింగ్స్​లో, సెక్యూరిటీ మెనూలో స్క్రీన్ పిన్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసి, ఇతరులు యాక్సెస్ చేసే యాప్ ను ఎంచుకోవాలి. ఇది మాత్రమే పని చేసి, మిగతా యాప్స్​ ఓపెన్ కాకుండా ఉంటాయి.

స్మార్ట్ లాక్
మొబైల్ కు ఒక లాక్, కొన్నిసార్లు యాప్స్ కు మరో లాక్ వాడుతుంటారు. దీనివల్ల ప్రతిసారీ లాక్ ఓపెన్ చేయడం, తిరిగి లాక్ చేయడం కొం చెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ సమస్యలకు స్ మార్ట్ లాక్ తో చెక్ పెట్టొచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి, సెక్యూరిటీలో కనిపించే ‘స్మార్ట్ లాక్’ను ఎనేబుల్ చేయాలి. దీనివల్ల మీరు సేఫ్ ప్లేసెస్ (ఇంట్లో) ఉన్నప్పుడు మొబైల్ కు లాక్ వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫోన్ మీ దగ్గర ఉన్నప్పుడు కూడా లాక్ తో పనిలేకుండా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.

వాల్యూమ్ సెట్టింగ్స్
రింగ్ టోన్, అలారం, మీడియా వాల్యూమ్ ను అడ్జస్ట్ చేసుకోవాలంటే సైడ్ కు ఉండే వాల్యూమ్ బటన్స్ ను ప్రెస్ చేస్తారు కదా. వీడియో, ఆడియో ప్లే అవుతున్నప్పుడు ప్రెస్ చేస్తే మీడియా వాల్యూమ్ అడ్జస్ట్ అవుతుంది. లేకపోతే రింగ్ టోన్ వాల్యూమ్ అడ్జస్ అవుతుంది. అయితే ఇవన్నీ ఒకేసారి అడ్జస్ట్ చేసుకోవాలంటే వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ పై కనిపించే బాక్స్ లో పక్కన చిన్నగా యారో లాగా కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీడియా, రింగ్ టోన్, అలారమ్ వాల్యూమ్ లు ఒకేసారి కనిపిస్తాయి. వాటిని టచ్ చేసి మూడింటినీ ఒకేసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు.

క్యాపిటలైజేషన్
మొబైల్ లో ఏదైనా టైప్ చేసేటప్పుడు ఒక వర్డ్ ను హైలైట్​ చేయాలన్నా, లెటర్ ను క్యాపిటలైజ్ చేయాలన్నా ‘జీ బోర్డ్’తో ఈజీగా చేయొచ్చు. జీబోర్డ్ పై టైప్ చేసేటప్పుడు ఒక పదాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది హైలైట్​అవుతుంది. అలాగే అప్పర్ కేస్ కీని డబుల్ ట్యాప్ చేస్తే ఫస్ట్​ లెటర్ క్యాపిటలైజ్ అవుతుంది.

మరిన్ని ఫీచర్లు
మొబైల్ నోటిఫికేషన్స్​స్క్రీన్ పై కనిపించాలంటే స్టేటస్ బార్ ను కిందికి స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ పై భాగంలో డబుల్ ట్యాప్ చేస్తే చాలు. కింది వైపు నోటిఫికేషన్స్​ కనిపిస్తాయి. క్రోమ్ యాప్ లో చాలా ట్యాబ్స్​ ఓపెన్ చేస్తుంటారు . ఒక ట్యాబ్ నుంచి మరో ట్యాబ్ ఓపెన్ చేయాలనుకుంటే కుడివైపు స్క్రీన్ పైన కనిపించే చిన్న ఐకన్ ను క్లిక్ చేయాల్సిన అసవరం లేదు. పైన అడ్రస్ బార్ నుంచి కిం దికి స్వైప్ చేస్తే చాలు. ట్యాబ్స్​అన్నీ ఒకదానిపైన మరోటి కనిపిస్తాయి. దీనివల్ల ఒక ట్యాబ్ నుంచి మరో ట్యాబ్ కు ఈజీగా స్విచ్ అవ్వొచ్చు.

స్ప్లిట్ స్క్రీన్
ఎక్కు వ మంది మొబైల్ లో ఒక్కసారి ఒక్క యాప్ మాత్రమే వాడుతుంటారు . అయితే ఒకేసారి రెండు యాప్స్​ను వాడుకునే వీలుంది. ‘స్ప్లిట్​ స్క్రీన్’ ఫీచర్ తో ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒకేసారి రెండు యాప్స్​ను వాడుకోవచ్చు. దీనికోసం కావాల్సిన యాప్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కింద మెనూ బార్ లో ఉండే ఓవర్ వ్యూ బటన్ (స్క్వేర్ బటన్) లాంగ్ ప్రెస్ చేయాలి. అంతే మొదటి యాప్ స్క్రీన్ లో సగానికి చేరుతుంది. ఆ తర్వాత కింద మిగతా యాప్స్​తో కూడిన మెను కనిపిస్తుంది. దీనిలోంచి కావాల్సిన రెండో యాప్ ను సెలెక్ట్​ చేసుకు ని ఓపెన్ చేయొచ్చు. ఇలా ఒకేసారి పైన ఒక యాప్, కింద మరో యాప్ వాడుకోవచ్చు.

వాట్సాప్ స్టేటస్ ఫేస్ బుక్ లో…
ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు రకరకాల స్టేటస్ లు పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రకరకాల స్టేటస్ లను అప్ట్‌ చేసుకుంటున్నారు. అందులో నచ్చిన వాటిని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో కూడా షేర్ చేసుకోవాలని ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు. అయితే త్వరలోనే వాట్సాప్ నుంచి నేరుగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, జీమెయిల్ వంటి వాటికి షేర్ చేసుకునే అవకాశం కలగనుం ది. వాట్సప్‌ కోసం ఫేస్ బుక్ ఈ ఫీచర్ ను రూపొందిస్తోంది.

ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ స్టేటస్ ను ఈజీగా సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు.ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్.. మూడిం టినీ ఒకే ప్లాట్​ఫామ్ పైకి తీసుకొచ్చేందుకు ఫేస్ బుక్ ప్రయత్నిస్తోంది. అంటే ఒక దాని నుంచి మరోదానికి ఈజీగా యాక్సెస్ చేసుకు నేలా రూపొందించనుంది.