టెక్నాలజీ : వాట్సాప్​లో మరో కొత్త అప్​డేట్

 టెక్నాలజీ : వాట్సాప్​లో మరో కొత్త అప్​డేట్
  • వెల్​కమ్ చెప్తోందివాట్సాప్​

వాట్సాప్​లో మరో కొత్త అప్​డేట్ వచ్చింది. వాట్సాప్​ గ్రూప్​లు ఉన్నవాళ్లకు ఈవెంట్స్ అనే ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా గ్రూప్​లోని మెంబర్స్​తో ఈజీగా గేదరింగ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు. ఈవెంట్స్​లో ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని గ్రూప్ మెంబర్స్​ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఈవెంట్స్​ క్రియేట్, ఎడిట్ చేయొచ్చు. 

ఈవెంట్స్ క్రియేషన్​ ఇలా..

  • వాట్సాప్​ గ్రూప్​ ఓపెన్ చేసి >event మీద క్లిక్ చేయాలి
  • అందులో ఈవెంట్​ పేరు, డేట్, టైం రాయాలి. 
  • ఈవెంట్​కి సంబంధించిన డిస్క్రిప్షన్, లొకేషన్ లేదా కాల్ లింక్​ కూడా యాడ్ చేయొచ్చు. 
  • డిస్క్రిప్షన్​లో 2,048 క్యారెక్టర్స్ ఉండాలి.
  • 12 నెలల తర్వాత జరిగే ఈవెంట్స్​కి సంబంధించిన కాల్​ లింక్స్​ ముందుగానే ఎంటర్​ చేయడానికి కుదరదు.
  • కావాలంటే జూమ్​ వంటి వేరే ప్లాట్​ఫామ్స్​ నుంచి లింక్స్​ యాడ్ చేసుకోవచ్చు. 
  • ఆపై send () సింబల్​ మీద క్లిక్ చేయాలి. 

ఎడిట్ చేయాలంటే...

  • గ్రూప్​ చాట్ ఓపెన్ చేసి గ్రూప్​ పేరు మీద క్లిక్ చేయాలి.
  • ఈవెంట్స్ మీద క్లిక్ చేయాలి. 
  • ఎడిట్ ఈవెంట్ మీద క్లిక్ చేయాలి. అందులో పేరు, తేదీ, టైం, లొకేషన్, డిస్క్రిప్షన్​లో మార్పులు చేసుకోవచ్చు. తర్వాత సేవ్ చేయడానికి () సింబల్ మీద క్లిక్ చేయాలి.
  • ఈవెంట్ క్యాన్సిల్ చేయాలంటే.. cancel event > yes మీద క్లిక్ చేయాలి. 

గుర్తుంచుకోవాల్సినవి.. 

  • ఈ ఈవెంట్స్ అనేవి ఈవెంట్ క్రియేటర్ నిర్వహిస్తాడు. అంతేకానీ, వేరే వాళ్లు హోస్ట్ చేయడానికి ప్రస్తుతానికి వీలుపడదు. 
  • ఒకవేళ డిజప్పియరింగ్​ మెసేజ్​లు ఆన్​లో పెట్టుకుంటే అడ్వాన్స్​గా క్రియేట్ చేసిన ఈవెంట్స్ కనిపించవు. 
  • క్యాలెండర్​ మొత్తం వాడాలనుకుంటే డిజప్పియరింగ్​ మెసేజ్​లు ఆఫ్​లో ఉంచాలి. 
  • గ్రూప్​లో లేని వాళ్లను ఈవెంట్స్ ద్వారా ఇన్వైట్ చేయడం కుదరదు. అలాగే వేర్​ చాట్​కి ఫార్వార్డ్​ కూడా చేయలేరు. 
  • కొత్తగా గ్రూప్​లో చేరినవాళ్లు ముందుగా క్రియేట్ చేసిన ఈవెంట్స్ చూడలేరు. 
  • కొత్తవాళ్లను యాడ్ చేయాలనుకుంటే ముందుగా క్రియేట్ చేసిన ఈవెంట్ డిలీట్​ చేసి కొత్తది క్రియేట్ చేయాలి. 
  • ఎడిట్ చేస్తే.. ఎడిట్ చేసినట్లు గ్రూప్ మెంబర్స్​కి నోటిఫికేషన్ వెళ్తుంది. గ్రూప్ చాట్​లో కూడా నోటిఫికేషన్ వస్తుంది. 
  • ఈవెంట్ క్రియేట్ చేసినవాళ్లే ఎడిట్, క్యాన్సిల్ చేయగలుగుతారు.