వాట్సాప్ వినియోగదారులకోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లని తీసుకొస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం చాట్ ట్రాన్స్పర్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇదివరకు వాట్సాప్ చాట్ ను ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్ లోకి షేర్ చేయడానికి కాస్త ఇబ్బంది ఎదురయ్యేది. ఈ అప్ డేట్ తో ఆ ఇబ్బంది పోయి ఈజీగా షేర్ చేసుకునే సదుపాయం కలుగుతుంది.
ఇదివరకు వాట్సాప్ చాట్ హిస్టరీనీ గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకొని, అక్కడినుంచి బ్యాక్ అప్ చేసుకునేవాళ్లు. కొత్త ఫోన్ కి మారినప్పుడల్లా గూగుల్ లాగిన్ అయి అక్కడినుంచి బ్యాక్ అప్ చేసుకునేవాళ్లు. అయితే, ఈ ఫీచర్ తో గూగుల్ నుంచి కాకుండా నేరుగా డివైజ్ టు డివైజ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్యూ ఆర్ కోడ్ తో స్కార్ చేసి చాట్ హిస్టరీ పొందొచ్చు. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్, త్వరలో అందుబాటులోకి వస్తుంది.