
న్యూఢిల్లీ: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వాట్సాప్ పేమెంట్స్ సేవలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ద్వారా ఇక నుంచి వాట్సాప్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. పేమెంట్స్ ఫీచర్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ను వాట్సాప్ వాడుకుంది. ఈ ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భాగస్వామ్యంతో వాట్సాప్ డిజైన్ చేసింది. వాట్సాప్ పేమెంట్ ద్వారా డబ్బులు పంపాలంటే బ్యాంక్ ఎకౌంట్, డెబిట్ కార్డు ఉండటం తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్‌తో అసోసియేట్ అయిన మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్ పేమెంట్స్‌కు లాగిన్ అవ్వొచ్చు.