వాట్సాప్ మొదట్లో ఒకరితో ఒకరు చాటింగ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్‌లను పిన్ చేసే ఆప్షన్ ఇచ్చింది. తర్వాత గ్రూప్ చాట్స్‌కు గత ఏడాది డిసెంబర్లో అనుమతించింది. అయితే ఒక మెసేజ్‌కు మాత్రమే పిన్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పిన్ చేసే ఆప్షన్ టెక్స్ట్, ఇమేజ్‌లు, పోల్‌లతో సహా అన్ని మెసేజ్ టైప్‌లకు అనుమతి ఇస్తుంది. ఇలా ఒకే చాట్‌లో ఏవైనా మూడు మెసేజ్‌లను పిన్ చేసే అవకాశం కల్పిస్తోంది.
మెసేజ్ పిన్ చేయడానికి యూజర్లు చాట్‌పై లాంగ్ ప్రెస్ చేసి ‘పిన్’ ఆప్షన్ సెలక్ట్ చేయాలి. అదనంగా యూజర్లు చాట్‌లో మెసేజ్ పిన్ చేసే టైంని సెట్ చేయొచ్చు. 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వరకు పిన్ టైమ్ సెట్ చేసే వీలుంది. అంతకంటే ఎక్కువ రోజులు పిన్నింగ్ చేసే ఆప్షన్ లేదు.
కాబట్టి ఇంకొన్ని రోజులకు పిన్ చేయాలనుకుంటే 30 రోజుల తర్వాత మళ్లీ చాట్స్ పిన్ చేయాలి. దీనికి బదులు యూజర్లు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మెను ద్వారా మెసేజ్ యాక్సెస్ చేయడానికి ‘స్టార్’ ఆప్షన్ ఎంచుకోవచ్చు.