బీజేపీలో కొత్త పదవి వాట్సాప్ ప్రముఖ్..తొలిసారిగా భోపాల్లో

బీజేపీలో కొత్త పదవి వాట్సాప్ ప్రముఖ్..తొలిసారిగా భోపాల్లో
  • మధ్యప్రదేశ్​లో తొలిసారి నియామకం

భోపాల్: బీజేపీ తమ పార్టీలో కొత్తగా ఓ పోస్టుని సృష్టించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో తొలిసారిగా ‘వాట్సాప్ ప్రముఖ్’ అనే పదవిని ఒకరికి కట్టబెట్టింది. ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్ అయిన రామ్ కుమార్ చౌరాసియాను ఆ పదవిలో నియమించింది. 

వాట్సాప్‌‌ ను ఉపయోగించి ప్రజలతో అనుసంధానం కావడం, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే బాధ్యతను అప్పగించింది. తన నియామకంపై రామ్ కుమార్ చౌరాసియా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

మధ్యప్రదేశ్ లో తొలిసారిగా ఈ తరహా ప్రయోగం జరగబోతుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే బూత్ కమిటీ ఎన్నికలు జరగనుండటంతో ఇటువంటి వినూత్న ప్రయత్నాలు అట్టడుగు స్థాయి సంబంధాలను బలోపేతం చేస్తాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. 

బీజేపీ బూత్ కమిటీల పునరుద్ధరణలో భాగంగా ఈ రోల్​ను సృష్టించింది.