మళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..

మళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..

మళ్లీ వాట్సప్ గంటలు మోగుతున్నాయి. ప్రైవసీ పాలసీకి సంబంధించి వాట్సప్ తన యూజర్లను అలర్ట్ చేయడం ప్రారంభించింది. ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే మే 15వ తేదీ నుంచి ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది తెలుపుతూ యూజర్లకు రిమైండర్లు పంపుతోంది. ఫేస్‌బుక్ భాగస్వామ్యం కలిగిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీ లోపు కొత్త ప్రైవసీ పాలసీలను యాక్సెప్ట్ చేయాలని యూజర్లను కోరింది. అయితే కొత్త ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది వాట్సప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేశారు. దాంతో వాట్సప్ కాస్త వెనక్కి తగ్గింది. తన ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకురావడాన్ని మే 15వ తేదీకి మార్చింది.

అయితే తాజాగా వాట్సప్ మళ్లీ తన యూజర్లకు ప్రైవసీ పాలసీకి సంబంధించి నోటిఫికేషన్లను పంపిస్తోంది. నూతన ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయాలని కోరుతోంది. దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్లను పలువురు వాట్సప్ యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వాట్సప్ మళ్లీ అలర్ట్ చేస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలాఉంటే.. వ్యక్తిగత చాటింగ్, ప్రైవసీకి సంబంధించి వాట్సప్ ఎలాంటి మార్పులు చేయడం లేదని వాట్సప్ యాజమాన్యం చెబుతోంది. ప్రైవసీ పాలసీ మే 15, 2021 నుండి అమలులోకి వస్తుందని, ఆ తేదీ తరువాత వాట్సాప్ వాడకాన్ని కొనసాగించడానికి వినియోగదారులు దీన్ని అంగీకరించాల్సిన అవసరం ఉందని వాట్సప్ చెబుతోంది.

దీని వల్ల యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని వివరణ ఇస్తోంది. మరోవైపు వాట్సప్ ప్రైవసీ పాలసీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవసీ పాలసీ పేరుతో యూజర్ల డాటాతో బిజినెస్ చేయాలని చూస్తోందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ అయిన వాట్సప్ ముఖ్యంగా యూజర్ల ఫోన్ నెంబర్లు, లావాదేవీలకు సంబంధించి వివరాలు ఇతరులతో పంచుకోవడానికే కొత్త ప్రైవసీ పాలసీని తీసుకువచ్చిందంటూ ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు భగ్గమంటున్నారు. ఇక వాట్సప్ చెబుతున్నట్లుగా యూజర్లు మే 15వ తేదీలోపు నూతన ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే.. సదరు యూజర్ల మొబైల్ ఫోన్లలో వాట్సప్ సరిగా పనిచేయదని తెలుస్తోంది. కాల్స్, నోటిఫికేషన్లు వస్తాయని, అయితే వచ్చిన మెసేజ్‌లను చూడటం, కొత్త మెసేజ్‌లు పంపడం సాధ్యపడదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రియుడితో పెళ్లికోసం చిన్నారిని ఎత్తుకెళ్లిన యువతి

ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం

14 ఏళ్ల బాలుడిని లోబరుచుకొని ప్రెగ్నెంట్ అయిన 23 ఏళ్ల యువతి

ఆకతాయిల వేధింపులు: నార్సింగిలో యువతి సూసైడ్