
గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ గ్రూప్‌లు మళ్లీ కనపడటంపై విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల ఏ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ గురించైనా గూగుల్‌లో సెర్చ్ చేసి దాంట్లో జాయిన్ అవ్వొచ్చు. ఈ సమస్యను తొలుతగా 2019లో గుర్తించారు. గతేడాది దీన్ని పరిష్కరించినప్పటికీ మళ్లీ ఈ సమస్య అటాక్ అయ్యింది. దీని వల్ల యూజర్ల ప్రొఫైల్ పిక్చర్స్, ఫోన్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించే ప్రమాదం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రూప్ చాట్స్‌లో నోఇండెక్సింగ్ మెటా ట్యాగ్‌ను చాటా లింక్స్‌తో వాట్సాప్ జత చేసింది. అయినా తిరిగి అదే ప్రాబ్లమ్ రావడం గమనార్హం.