వాట్సాప్ యూజర్లకు కొత్త ఫీచర్ వచ్చేసింది. దీంతో ఇక వాట్సాప్‌లో డైరెక్ట్‌గా డాక్యుమెంట్లను స్కాన్ చేయొచ్చు. ఈ ఫీచర్ డాక్యుమెంట్ షేరింగ్ మెనూలో కనిపిస్తుంది. తద్వారా వాట్సాప్ యూజర్లు వేరే ఇతర స్కానింగ్ టూల్స్ లేదా యాప్‌లు వాడాల్సిన అవసరం ఉండదు. కెమెరాను ఉపయోగించి డాక్యుమెంట్లను వెంటనే క్యాప్చర్ చేయొచ్చు. రాబోయే వారాల్లో చాలామంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.
డాక్యుమెంట్ షేరింగ్ మెనూని ఓపెన్ చేసి స్కాన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కెమెరా యాక్టివేట్ అవుతుంది. డాక్యుమెంట్ క్యాప్చర్ చేసిన తర్వాత యూజర్లు వెంటనే స్కాన్‌ని ప్రివ్యూ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాప్ ఆటోమెటిక్‌గా మార్జిన్లు చూపిస్తుంది. అయితే, యూజర్లు మాన్యువల్‌గా కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డాక్యుమెంట్ చాట్ లేదా గ్రూప్‌కు షేర్ చేయొచ్చు. అంతేకాకుండా స్కాన్ క్వాలిటీ, రీడబిలిటీ కోసం ఆప్టిమైజ్ అయింది. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు ప్రొఫెషనల్‌గా డిస్ప్లే అవుతాయి. రిసీప్ట్‌లు, డీల్స్, నోట్లను షేరింగ్ చేయడం కోసం పర్సనల్, బిజినెస్ సంబంధించిన అవసరాలకు ఉపయోగపడుతుంది ఈ ఫీచర్.