మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లను ఆర్కైవ్ చేయడానికి యూజర్స్ ను అనుమతిస్తుంది. "గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.23.24.8 అప్‌డేట్ కోసం తాజా WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, వాట్సాప్ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌కు కొన్ని అప్ డేట్స్ ను పరిచయం చేయనుంది" అని WABetaInfo నివేదించింది.
కమ్యూనిటీ గ్రూప్ చాట్ మెనులో “ఆర్కైవ్ చాట్” అనే కొత్త ఆప్షన్ ఉందని WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్ వెల్లడించింది. దీంతో, యూజర్స్ వారి కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లను ఆర్కైవ్ చేయడం, వాటిపై కంట్రోల్ చేసే యాక్సెస్ ను పొందుతారు. అనేక కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లలో ఉన్న కమ్యూనిటీ సభ్యులకు, వారి చాట్ జాబితాను క్లీన్ గా, మరింత ఆర్గ నైజ్డ్ గా ఉంచాలనుకునే వారికి ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.
'కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లను ఆర్కైవ్ చేయగల ఫీచర్ తో WhatsApp మునుపటి అప్‌డేట్ వల్ల కలిగే అసౌకర్యాన్ని సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. ఇది కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లను ఆర్కైవ్ చేసే ఆప్షన్ ను తొలగించింది. కమ్యూనిటీ మెంబర్‌లు ఇప్పుడు కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్‌తో సహా పనికిరాని కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లను ఆర్కైవ్ చేయడం ద్వారా తమ చాట్ అనుభవంపై నియంత్రణను తిరిగి పొందవచ్చు” అని WABetaInfo తెలిపింది.
కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లను ఆర్కైవ్ చేసే ఫీచర్ Google Play Store నుండి Android అప్‌డేట్‌ల కోసం తాజా WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఇది రాబోయే రోజుల్లో మరింత మంది వ్యక్తులకు అందుబాటులోకి రానుంది.
ALSO READ :- Electoral Bonds: ఎన్నికల బాండ్లపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు